Prabhas With Siddharth Anand : సల్మాన్, షారుఖ్‌లు మాట్లాడుకుంది ప్రభాస్ గురించేనా?.. సిద్దార్థ్ ఆనంద్ ప్లానింగ్ అదేనా?

Prabhas With Siddharth Anand ప్రభాస్ సిద్దార్థ్ ఆనంద్ కలిసి సినిమాను చేయబోతోన్నట్టుగా మైత్రీ మూవీస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందన్న దానిపై ఓ హింట్ అయితే పఠాన్ ద్వారా ఇచ్చినట్టు కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2023, 01:17 PM IST
  • పఠాన్‌కు పాజిటివ్ టాక్
  • దుమ్ములేపేసిన సిద్దార్థ్ ఆనంద్
  • ప్రాంచైజీలపై హింట్ ఇచ్చిన డైరెక్టర్
Prabhas With Siddharth Anand : సల్మాన్, షారుఖ్‌లు మాట్లాడుకుంది ప్రభాస్ గురించేనా?.. సిద్దార్థ్ ఆనంద్ ప్లానింగ్ అదేనా?

Salman Khan in Pathaan యశ్ రాజ్ ఫిల్మ్స్ ఫ్రాంచైజీల మీద ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాలతో సల్మాన్ దుమ్ములేపేశాయి. వార్ సినిమాలో కబీర్‌గా హృతిక్ రోషన్ మెప్పించాడు. అదే సినిమాలో టైగర్ ష్రాఫ్ కూడా అదరగొట్టేశాడు. ఇప్పుడు పఠాన్ అంటూ షారుఖ్ ఖాన్ వచ్చాడు. అయితే సిద్దార్థ్ ఆనంద్ ఇప్పుడు మళ్లీ హృతిక్‌తో ఫైటర్ అనే సినిమాను చేస్తున్నాడు. అయితే ప్రభాస్‌తో సిద్దార్థ్ చేయబోయే సినిమా మీద కాస్త హింట్ ఇచ్చినట్టు అనిపిస్తోంది.

పఠాన్‌ను కాపాడేందుకు టైగర్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. టైగర్‌కు అవసరం వస్తుంది.. అప్పుడు నువ్ సాయం చేయాలి.. నువ్ బతికే ఉండాలి.. అంటూ షారుఖ్‌తో సల్మాన్ చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది. అంటే నెక్ట్స్ సల్మాన్‌ను కాపాడేందుకు షారుక్‌ వస్తాడన్న మాట. ఇక ఈ మూవీ చివర్లో షారుఖ్, సల్మాన్‌ ముచ్చట్లు కూడా అందరిలోనూ ఎన్నో అనుమానాలు వస్తుంటాయి.

మనం ముప్పై ఏళ్లుగా చేస్తూనే ఉన్నాం.. ఇక ఆపేద్దామా? అని షారుఖ్ ఖాన్ అంటాడు. మరి మనల్ని రీప్లేస్ చేసేది ఎవరు? అని సల్మాన్ ఖాన్ అడుగుతాడు. అది కూడా కరెక్టే కదా?.. అతను అయితే బాగుంటుంది అని షారుఖ్ అంటే.. అతను సెట్ అవ్వడు.. నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు.. అతను అయితే ఓకే అని సల్మాన్ ఖాన్ అంటాడు. అతను వద్దు అంటాడు షారుఖ్. అయిన దేశ రక్షణకు సంబంధించిన విషయాలు అలా చిన్నపిల్లలకు ఎలా ఇస్తాం.. మనమే చేద్దాంలే అని షారుఖ్, సల్మాన్‌లు ముగిస్తారు.

అంటే సిద్దార్థ్ ఆనంద్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో మాత్రం షారుఖ్, సల్మాన్, హృతిక్, ప్రభాస్ ఇలా అందరినీ కలిపి చూపిస్తాడా? అవెంజర్స్ టైపులో భారీగా ప్లాన్ చేస్తున్నాడా? అన్నది చూడాలి. ఇక మళ్లీ బాలీవుడ్ అయితే ఫాంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది.

Also Read:  Naatu Naatu oscar Nominations : టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ టైం.. నామినేట్ అయిన నాటు నాటు

Also Read: Pawan Kalyan's Fan Death News: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. అభిమాని మృతి, ముగ్గురికి గాయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News