Pathaan Movie Review and rating బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నాలుగేళ్ల తరువాత షారుఖ్ ఖాన్ ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను వందకు పైగా దేశాల్లో దాదాపు ఏడు వేల స్క్రీన్లలో రిలీజ్ చేశాడు. ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలతో వచ్చేసింది. మరి ఈ సినిమాను చూసిన జనాలు మాత్రం ఫిదా అవుతున్నారు. కథ, కథనాలను అస్సలు ఊహించలేమని అంటున్నారు. అసలీ సినిమా కథ, కథనాలు ఏంటో ఓ సారి చూద్దాం.
కథ
ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాక్తిస్థాన్ జనరల్ ఇండియా మీద ఓ అటాక్ ప్లాన్ చేస్తాడు. దాని కోసం ప్రైవేట్ ఎజెంట్ అయిన జిమ్ (జాన్ అబ్రహం)ను సంప్రదిస్తాడు పాక్ జనరల్. అయితే దాన్ని అడ్డుకునేందుకు పఠాన్ (షారుఖ్ ఖాన్) రంగంలోకి దిగుతాడు. అసలు జిమ్ చేసిన రక్త భీజ్ ప్లాన్ ఏంటి? పఠాన్‌కు జిమ్‌కు ఉన్న రిలేషన్ ఏంటి? జోకర్ (JOCR)ను పఠాన్ ఎందుకు ఏర్పాటు చేస్తాడు? ఇక ఈ కథలో రూబై (దీపిక పదుకొణె) పాత్ర ఏంటి? రక్తభీజ్ కోసం జిమ్, పఠాన్ చేసిన పోరాటాలు ఏంటి? అసలే ఈ రక్త భీజ్‌తో ఇండియా మీద చేసిన కుట్ర ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.
నటీనటులు
పఠాన్ పాత్రలో భారత సైనికుడిగా షారుఖ్ ఖాన్ అద్భుతంగా నటించాడు. అండర్ కవర్ ఆపరేషన్స్ చేయడంలో దిట్ట అనిపించుకునే పాత్రలో షారుఖ్ నటన, స్వాగ్, స్టైల్, యాక్షన్స్ ఇలా అన్నింట్లో షారుఖ్ తన మార్క్ చూపించాడు. చాలా రోజుల తరువాత షారుఖ్ ఎనర్జీ తెరపై కనిపించింది. ఫ్యాన్స్ కొరుకునే రొమాంటిక్, యాక్షన్ యాంగిల్స్‌ను ఇందులో చూపించారు. ఇక దీపికను బికినీలో చూసి ఎంతగా ఆశ్చర్యపోతారో.. యాక్షన్ సీక్వెన్స్‌లో చూసి కూడా అంతే ఆశ్చర్యపోతారు. జాన్ అబ్రహం నెగెటివ్ రోల్‌లో అదరగొట్టేశాడు. కల్నల్ లూత్రాగా అశుతోష్ రానా, డింపుల్ కపాడియా పాత్రలు సైతం అందరినీ మెప్పిస్తాయి. మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు.
విశ్లేషణ
ఇండియా, పాకిస్థాన్, అండర్ కవర్ ఆపరేషన్స్, రా ఏజెంట్స్ అంటూ తీసే కాన్సెప్టుల్లో దేశ భక్తిని ఎక్కువగా చూపించే చాన్స్ ఉంటుంది. పేట్రియాటిక్ సినిమాలకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంటుంది. ఆ టైపు కథలకు కాస్త యాక్షన్ అడ్వెంచర్‌ను కలిపితే సినిమాలు కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ ఫార్మూలాను సిద్దార్థ్ ఆనంద్ పట్టేసుకున్నాడు.
యశ్ రాజ్ ఫిల్మ్స్‌లో వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హైల రిఫరెన్సులు ఇందులో కనిపిస్తాయి. ఇక సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన వార్ సినిమా కూడా ఇంటర్ లింక్ అయి ఉంటుంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీ టైపులో సిద్దార్థ్ కూడా గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు. ఇందులో పఠాన్ కోసం టైగర్ కూడా వస్తాడు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కలిసి చేసిన యాక్షన్ సీక్వెన్స్ మూవీ లవర్స్‌కు కిక్కిచ్చేలా ప్లాన్ చేశాడు డైరక్టర్.
ప్రథమార్థంలో జాన్ అబ్రహం, షారుఖ్ తలపడే సీన్లు, యాక్షన్ సీక్వెన్సులు అదిరిపోతాయి. ఫస్ట్ హాఫ్‌లో కథ ముందుకు వెనక్కి వెళ్తున్నట్టుగా ఉంటుంది. కాస్త గందరగోళంగా అనిపించినా.. తెరపై విజువల్ వండర్‌గా తీర్చి దిద్దడంలో ప్రేక్షకుడు బోరింగ్‌గా ఫీల్ అవ్వడు. ఇంటర్వెల్‌కు ఇచ్చిన ట్విస్టును కాస్త పసిగట్టేలానే ఉంది. దీపిక అందాలు, యాక్షన్ సీక్వెన్స్‌కు ప్రథమార్థానికి కలిసి వచ్చేలా రాసుకున్నాడు దర్శకుడు.
పఠాన్ కోసం డైరెక్టర్ రాసుకున్న ట్విస్టులు మరీ అంత గొప్పగా ఏమీ అనిపించవు. వార్ సినిమాను చూసిన వారికి ఇది అంత గొప్పగా అనిపించకపోవచ్చు. అయితే సినిమాను గ్రిప్పింగ్‌గా, అడ్వంచరస్ యాక్షన్ సీక్వెన్స్‌లతో తీసుకెళ్లడంతో దర్శకుడు గట్టెక్కినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ ఏం జరగుతుందో అందరికీ అర్థమవుతుంది. కానీ అది ఎలా ముగుస్తుంది? ఎలా కాపాడుతాడు అని ఉత్కంఠ రేపేలా తెరకెక్కించాడు.
పఠాన్ సినిమా విజువల్ వండర్‌గా తీయడమే కాకుండా.. సాంకేతికంగా ఎంతో ఉన్నత స్థాయిలో అనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. ఇక మాటలు, పాటలు, ఆర్ఆర్ సినిమాకు ప్లస్ అవుతాయి. సినిమాటోగ్రఫీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ మరోసారి తమ స్టామినాని చాటాయి.
రేటింగ్ : 3
బాటమ్ లైన్ : బాలీవుడ్‌ను కాపాడే పఠాన్
Also Read: Naatu Naatu oscar Nominations : టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ టైం.. నామినేట్ అయిన నాటు నాటు
Also Read: Pawan Kalyan's Fan Death News: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. అభిమాని మృతి, ముగ్గురికి గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి