Pradosha Vratham and Masa Sivaratri on 2022 December 21: 2022 సంవత్సరం శివుని ఆశీస్సులు పొందడానికి పవిత్రమైన అవకాశాన్ని కల్పిస్తోంది. నేడు (21 డిసెంబర్ 2022) చాలా శుభప్రదమైన మరియు అరుదైన యాదృచ్ఛికం ఏర్పడింది. ఈరోజు పౌషమాస ప్రదోష వ్రతం మరియు మాస శివరాత్రి కూడా. ఈ రోజు ఒక ఉపవాసం చేయడం ద్వారా.. రెండు ఉపవాసాల ఫలితంను పొందవచ్చు. అలాగే ఈ శుభ కలయిక (పౌషమాస ప్రదోష వ్రతం, మాస శివరాత్రి) కొన్ని రాశుల వారికీ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.
ప్రదోష వ్రతాన్ని ప్రతి నెల త్రయోదశి రోజున పాటిస్తారు. అయితే నెల వారీ శివ రాత్రిని ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు. ఈసారి పౌషమాస కృష్ణ పక్షంలోని త్రయోదశి తిథి డిసెంబర్ 20 మధ్య రాత్రి 12.45 గంటలకు ప్రారంభమై డిసెంబర్ 21 రాత్రి 10.16 గంటలకు ముగుస్తుంది. మరోవైపు పౌషమాస కృష్ణ పక్ష చతుర్దశి డిసెంబర్ 21 రాత్రి 10.16 గంటలకు ప్రారంభమై డిసెంబర్ 22 రాత్రి 07.13 వరకు ఉంటుంది. కానీ డిసెంబరు 22 సాయంత్రం మాసిక్ శివరాత్రి పూజలకు అనుకూలమైన సమయం కాదు. కాబట్టి మాసిక్ శివరాత్రిని డిసెంబర్ 21 రాత్రి మాత్రమే జరుపుకుంటారు. ఇలా ప్రదోష వ్రతం మరియు నెలవారీ శివరాత్రి ఒకే రోజున వచ్చింది.
వృషభం:
వృషభ రాశి వ్యక్తుల పని పట్ల వారి యజమాని సంతృప్తిగా ఉంటాడు. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. వ్యాపారస్తులు పనులపై పూర్తి శ్రద్ధ వహిస్తే.. మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఆనందం ఉంటుంది.
మిథునం:
కష్టానికి తగిన ఫలాలు ఉన్నాయి. కెరీర్‌లో ఎదుగుదల బాగుంటుంది. వ్యాపారులు కూడా లాభపడతారు. పెద్ద డీల్ ఫైనల్ కావచ్చు. మీ కోరికలు నెరవేరుతాయి.
సింహం:
కెరీర్ పరంగా ఈ రోజు చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఫ్రెషర్లు ప్రయోజనం పొందుతారు. శ్రమకు తగిన ఫలం లభిస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది.
మీనం:
బుద్ది బలంతో పనిని పూర్తి చేస్తారు. కష్టమైన పనులను కూడా పూర్తి చేస్తారు. అనుకూల సమయం ఉంది. పెట్టుబడికి ఇది మంచి సమయం. అధిక ధన లాభం ఉంటుంది.
Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.