/telugu/photo-gallery/puri-jagannadh-explains-about-emotional-blockmail-in-puri-musings-pa-180794 Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్..  షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? 180794

Shiva Rajkumar GHOST : కన్నడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ ప్రస్తుతం ఘోస్ట్ సినిమాతో దేశ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఘోస్ట్ సినిమాను కేవలం కన్నడలోనే కాకుండా మిగతా అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీలో శివ రాజ్ కుమార్ అదరగొట్టేస్తోన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీని బీర్బల్ డైరెక్టర్ శ్రీని తెరకెక్కిస్తున్నాడు.

సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నాడు. 28 రోజుల పాటు సాగిన మొదటి షెడ్యూల్‌లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ జరిగాయి. ఈ షెడ్యూల్ కోసం దాదాపు ఆరు కోట్లతో అదిరిపోయే జైల్ సెట్ వేశారు. అందులోనే ఎన్నో యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసినట్టు తెలుస్తోంది.

ఫస్ట్ షెడ్యూల్ వర్కింగ్ స్టిల్స్, పోస్టర్లు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ మేకింగ్ వీడియోలో నేపథ్య సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు వచ్చింది. ఈ మూవీ రెండో షెడ్యూల్‌ను త్వరలోనే ప్రారంభించబోతోన్నారట.

డిసెంబర్ రెండో వారం నుండి రెండో షెడ్యుల్ చిత్రీకరణ ప్రారంభమవుతుందని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ షెడ్యుల్ కోసం ప్రిజన్ బయటి లుక్ సెట్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో శివ రాజ్ కుమార్ కొత్త పోస్టర్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ చిత్రంలో జయరామ్, అచ్యుత్ కుమార్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Also Read : Naga Chaitanya Shobitha Dhulipalla : అడ్డంగా దొరికిపోయిన శోభితా-నాగ చైతన్య?.. ఆడేసుకుంటున్న సమంత ఫ్యాన్స్.. అక్కినేని అభిమానుల మాట ఇదే  

Also Read : Richa Chadha controversy : మా ప్రెసిడెంట్‌కు కోపం తెప్పించిన బాలీవుడ్ నటి.. ఏం ఆడది ఇది?.. మంచు విష్ణు ట్వీట్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Section: 
English Title: 
Shiva Rajkumar Pan India Project GHOST Second Schedule in December
News Source: 
Home Title: 

Shiva Rajkumar GHOST : డిసెంబర్‌లో ఘోస్ట్ సందడి.. సెట్‌లో శివ రాజ్‌కుమార్ యాక్షన్

Shiva Rajkumar GHOST : డిసెంబర్‌లో ఘోస్ట్ సందడి.. సెట్‌లో శివ రాజ్‌కుమార్ యాక్షన్
Caption: 
Kannada Ghost (source : Twitter)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

కన్నడ ఘోస్ట్ అప్డేట్

డిసెంబర్‌లో సెకండ్ షెడ్యూల్

రంగంలోకి కన్నడ చక్రవర్తి

Mobile Title: 
Shiva Rajkumar GHOST : డిసెంబర్‌లో ఘోస్ట్ సందడి.. సెట్‌లో శివ రాజ్‌కుమార్ యాక్షన్
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Friday, November 25, 2022 - 12:37
Request Count: 
49
Is Breaking News: 
No