Manoj Tiwary is part of IPL 2022 Player Auction List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్ల జాబితాను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం (ఫిబ్రవరి 1) విడుదల చేసింది. బెంగుళూరులో ఫిబ్రవరి 12, 13 తేదీల్లో నిర్వహించనున్న మెగా వేలంలో 590 మంది క్రికెటర్లు పాల్గొననున్నారు. బీసీసీఐ ప్రకటించిన 590 మందిలో 228 మంది క్యాప్డ్, 355 మంది అన్‌క్యాప్డ్ కాగా.. ఏడు మంది ఇతర దేశాలకు చెందినవారు ఉన్నారు.
ఐపీఎల్ 2022 మెగా వేలం నేపథ్యంలో 48 మంది ప్లేయర్స్ తమ కనీస ధరను 2 కోట్లుగా పేర్కొనగా.. 20 మంది ఆటగాళ్లు ఒకటిన్నర కోటి తమ బేస్ ప్రైస్‌గా పేర్కొన్నారు. 34 మంది ఆటగాళ్లు ఒక కోటి రూపాయలను తమ బేస్ ప్రైస్‌గా ప్రకటించారు. ఇక మిగతావారి కనీస ధర ఒక కోటి కంటే తక్కువగా ఉంది. ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి, టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ కూడా ఉన్నారు. తివారీ 50 లక్షల కనీస ధరతో ఐపీఎల్ 2022 మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకున్నారు. అయితే గతకొంత కాలంగా క్రికెట్ ఆడని ఈ క్రీడా మంత్రిని ఏ ప్రాంచైజీ అన్న తీసుకుంటుందో లేదో చూడాలి.
West Bengal Sports Minister Manoj Tiwary is part of the IPL mega auction 2022 with a base price of 50 Lakh.
— Johns. (@CricCrazyJohns) February 1, 2022
36 ఏళ్ల మనోజ్ తివారీ టీమిండియా తరఫున 12 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. తివారీ 98 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 7 అర్ధ సెంచరీలతో 1695 పరుగులు చేశారు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం క్యాపిటల్స్), కోల్‌కతా నైట్ రైడర్స్, రైజింగ్ పూణె సూపర్‌జెయింట్ మరియు పంజాబ్ కింగ్స్‌లకు అతడు ప్రాతినిధ్యం వహించారు. తివారీ చివరిసారిగా ఐపీఎల్ 2018లో పంజాబ్ తరఫున ఆడారు. ఐపీఎల్ 2020 వేలంలో తివారీని ఏ ప్రాంచైజీ కొనుగోలు చేయలేదు.
Also Read: IPL 2022 Auction: ఐపీఎల్ 2022 వేలం జాబితా విడుదల.. అందుబాటులో స్టార్ ప్లేయర్స్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook