Sreeleela: అయోమయంలో శ్రీలీల.. హీరోయిన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి నో క్లారిటీ

Sreeleela Upcoming Movies: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిన్నటి వరకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరు అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు శ్రీలీల. అయితే వరుస ప్లాపులు ఈ బ్యూటీ జోరుకు కాస్త బ్రేక్ వేసి.. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ఆలోచించుకునే విధంగా చేస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2024, 07:00 PM IST
Sreeleela: అయోమయంలో శ్రీలీల.. హీరోయిన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి నో క్లారిటీ

Sreeleela Next Project: పెళ్లి సందడి మూవీతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు మనసు దోచుకున్న హీరోయిన్స్ శ్రీలీల. రవితేజ ధమాకా చిత్రంతో మొదటి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత టాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోయింది. ఒక టైం లో ఏ సినిమా పోస్టర్ మీద చూసిన శ్రీ లీల ఫోటో కనిపించేది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. మిడ్ రేంజ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు వచ్చిన ప్రతి ఆఫర్ కి ఓకే చెబుతూ ముందుకు సాగిన శ్రీలీల ప్రస్తుతం నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి తెగ ఆలోచిస్తుంది.

రీసెంట్ గా శ్రీలీల నటించిన గుంటూరు కారం చిత్రం కమర్షియల్ గా మంచి వసూళ్లు రాబట్టింది. అయితే మహేష్ బాబుకి ఉన్న స్టార్ డమ్, క్రేజ్ లెక్కలోకి తీసుకుంటే ఇది జస్ట్ యావరేజ్ అన్న విషయం ఒప్పుకోవాల్సిందే. అంటే ఈ మూవీ ని బ్లాక్ బస్టర్ గా అనుకోలేము. గుంటూరు కారం మూవీకి ముందు శ్రీలీల నితిన్ ఎక్స్ట్రార్డినరీ మ్యాన్, వైష్ణవ తేజ ఆదికేశవ, రామ్ పోతినేని స్కంద మూవీస్ లో హీరోయిన్ గా చేసింది. అయితే ఈ మూడు చిత్రాలు భారీ డిజాస్టర్ గా మిగిలాయి.

 ఇప్పటివరకు శ్రీ లీల ఖాతాలో భగవంత్ కేసరి మూవీ మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీ సక్సెస్ మొత్తం బాలయ్య క్రెడిట్ లోకి వెళ్ళింది. ఇలా వరుస ప్లాపులు వెంటాడుతూ ఉండడంతో శ్రీలీల తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నట్లు టాక్. అందుకే ప్రస్తుతం ఆమె కొత్త కమిట్మెంట్లు ఏవి ఇవ్వలేదు. మరో పక్క పవన్ కళ్యాణ్ తో శ్రీలీల నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి డేట్లు ఎప్పుడు అవసరమవుతాయో తెలియని పరిస్థితి. ప్రస్తుతం ఎన్నికల హడావిడిలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ ఎప్పుడు ఇస్తే అప్పుడు షూటింగ్ కొనసాగించాలి.

కాబట్టి అప్పటివరకు శ్రీలీల ఓపికగా వెయిట్ చేయక తప్పదు. పవన్ కళ్యాణ్ మూవీని వదులుకోవడం ఆమె కెరీర్ కు రిస్క్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ చిత్రం సాలిడ్ హిట్ అయితే.. శ్రీ లీల కెరీర్ కి ఇది కొత్త బూస్ట్ అవుతుంది. కాబట్టి చూస్తూ చూస్తూ అంత మంచి ఆఫర్ని వదులుకోలేదు కదా. ఇక వెంకీ కుడుముల, నితిన్ కాంబోలో రాబోతున్న రాబిన్ హుడ్ మూవీ కోసం శ్రీలీలను అడిగినట్లు టాక్. ప్రస్తుతానికి హీరోయిన్ లేకుండా షూటింగ్ కానిస్తున్నప్పటికీ రేపో మాపో హీరోయిన్ ఎవరు అన్న విషయం రివీల్ చేయాల్సిందే.

మరోపక్క స్టార్ హీరోలు ఎవ్వరూ ఖాళీగా లేరు. మహేష్ బాబు,రాజమౌళి మూవీ లో శ్రీలీల ఎంట్రీ డౌటే.. ఇక చరణ్, బుచ్చిబాబు మూవీకి జాన్వీ కపూర్ ఫిక్స్ అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలలో కూడా ఛాన్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ నానితో నెక్స్ట్ మూవీ కోసం ఛాన్స్ వాస్తే రావ్వొచు. ఈ నేపథ్యంలో శ్రీ లీల తదుపరి ప్రాజెక్టు గురించి అయోమయం నెలకొంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఫైనల్ గా శ్రీలీల ఎవరికి జోడిగా మారుతుందో చూడాలి.

Also Read: Cancer Diet: కేన్సర్‌ను సైతం వణికించి దరిచేరకుండా చేసే ఆహార పదార్ధాలు ఇవే

Also Read: Pineapple Benefits: రోజూ పైనాపిల్ తీసుకుంటే ఈ 4 వ్యాధులకు చెక్

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News