Director Teja - Suman Shetty: కృతజ్ఞత అంటే ఇది.. ఏకంగా రూమ్ సిద్ధం చేశాడట.. ఆసక్తికర విషయం బయట పెట్టిన తేజ

Director Teja on Suman Shetty: నటుడు సుమన్ శెట్టి గురించి తాజా ఇంటర్వ్యూలో తేజ ఒక ఆసక్తికర విషయం పంచుకున్నారు. తన కోసం ఆయన ఒక గిఫ్ట్ ఇచ్చాడని తేజ అన్నారు. 

Last Updated : Nov 5, 2022, 09:19 PM IST
Director Teja - Suman Shetty: కృతజ్ఞత అంటే ఇది.. ఏకంగా రూమ్ సిద్ధం చేశాడట.. ఆసక్తికర విషయం బయట పెట్టిన తేజ

Suman Shetty Built a Portion for Director Teja: తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలు రావడం అనేది మామూలు విషయం కాదు. సెలబ్రిటీల పిల్లలకి ఇక్కడ ఈజీగా అవకాశాలు దొరుకుతాయనే భావన చాలా మందిలో ఉంటుంది కానీ తన సినీ కెరియర్లో మొత్తం 1163 మందిని తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశానని దర్శకుడు తేజ వెల్లడించారు. జీ తెలుగు న్యూస్ కి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని దర్శకుడు తేజ చెప్పుకొచ్చారు.

నటీనటులు, హీరో హీరోయిన్లు ఇతర టెక్నీషియన్లు అందరినీ లెక్క వేస్తే 1163 మందిని తాను ఇంట్రడ్యూస్ చేశానని ఆయన అన్నారు. అయితే వీరిలో ఎంతమందికి కృతజ్ఞతా భావం ఉంటుందని మీరు భావిస్తున్నారు అంటే ఒక 20 మంది లోపే ఆ భావం ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కమెడియన్ సుమన్ శెట్టి గురించి ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సుమన్ శెట్టి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన కొత్తలో తాను వచ్చిన డబ్బుతో ఒక స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోమని సలహా ఇచ్చానని అతను నేను చెప్పిన మాట విన్నాడని తేజ అన్నారు.

అలా ఇల్లు పూర్తయిన తర్వాత వచ్చి మీ కాళ్లు పట్టుకుని ఆశీర్వాదం తీసుకుందామని అనుకుంటున్నాను అని అంటే కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదని అన్నానని చెప్పుకొచ్చారు. అయితే మీరు ఏదో విధంగా రుణం తీర్చుకునే అవకాశం కల్పించాలని సుమన్ శెట్టి ప్రాధేయ పడటంతో అప్పుడు తాను నేను ఇలాగే కొత్తవారితో సినిమాలు చేస్తూ ఉంటాను నా జీవితాంతం ఇలా కొత్తవారిని పరిచయం చేస్తూనే ఉంటాను ఒకానొక రోజున అన్ని పోగొట్టుకుని రోడ్డున పడితే నాకు ఉండటానికి ఒక రూమ్ ఇవ్వగలవా అని అడిగానని ఆయన అన్నారు.

ఆయన వెంటనే మాట ఇవ్వడమే కాక ఒక రూమ్ నాకోసం సిద్ధం చేసి ఉంచాడని అన్నారు. ఇప్పటికీ ఆ రూమ్లో నా ఫోటో తప్ప ఇంకేమీ ఉండవని ప్రతిరోజూ శుభ్రం చేయిస్తూ ఉంటాడని చెప్పుకొచ్చారు. 

Also Read: Director Teja - Pooja Hegde: పూజా హెగ్డే ఎవరు? నాకు తెలీదే!.. డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్!

Also Read: Uday Kiran Death Secret: ఉదయ్ కిరణ్ అందుకే చనిపోయాడు.. అంతా చెప్పాడని కీలక విషయం బయటపెట్టిన తేజ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News