సూర్య 'గ్యాంగ్' చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ నటుడు సూర్య నటించిన 'తానా సెరెంద కూటమ్' చిత్రాన్ని 'గ్యాంగ్' పేరుతో తెలుగులో డబ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Last Updated : Jan 5, 2018, 05:43 PM IST
సూర్య 'గ్యాంగ్' చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ నటుడు సూర్య నటించిన 'తానా సెరెంద కూటమ్' చిత్రాన్ని 'గ్యాంగ్' పేరుతో తెలుగులో డబ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12వ తేదిన ఇదే చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల అవుతోంది. హిందీ చిత్రం 'స్పెషల్ 26'కు ఈ చిత్రం రీమేక్ అని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గ్యాంగ్' చిత్రాన్ని తమిళంలో భారతన్ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.

అనిరుధ్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్య సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. స్టూడియో గ్రీన్, అద్నా ఆర్ట్స్ బ్యానరుపై తెరకెక్కిన ఈ చిత్రాన్ని జ్ఞాన్‌వేల్ రాజా నిర్మిస్తున్నారు. కాగా కార్తీక్, రమ్యక్రిష్ణ, సెంథిల్, తంబి రామయ్య, సత్యన్, వినోదిని, బ్రహ్మానందం ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. తమిళ పండగైన తాయి పొంగల్ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారని నిర్మాతలు తెలిపారు

 

Trending News