మీడియాపై తాప్సీ పన్ను గరం గరం

మీడియాకు తాప్సీ పన్ను లెక్చర్ 

Last Updated : May 30, 2018, 08:35 PM IST
మీడియాపై తాప్సీ పన్ను గరం గరం

అప్పుడెప్పుడో టాలీవుడ్‌లో వరుసపెట్టి అవకాశాలు దక్కించుకుని ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టిన ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను అడపాదడపా అక్కడ కూడా అవకాశాలు దక్కించుకుంటూనే వుంది. భారీ బడ్జెట్ సినిమాల్లో అవకాశాలు రాకపోయినా.. ఈ ఏడాది చిన్నాచితకా అన్నీ కలుపుకుని ఐదు సినిమాలకు సైన్ చేసిన ఈ ఢిల్లీ బ్యూటీ తాజాగా ఓ బాలీవుడ్ నటుడి సరసన నటించేందుకు నో చెప్పిందంటూ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఆ నటుడు ఎవరో కాదు.. బజ్రంగీ భాయిజాన్ సినిమాలో పాత్రికేయుడిగా నటించి సల్మాన్ తర్వాత ఆ సినిమాలో మళ్లీ అంతటి పేరు తెచ్చుకున్న నవాజుద్దీన్ సిద్ధిఖీ. బజ్రంగీ భాయిజాన్ సినిమాతో తనని తాను నిరూపించుకున్న నవాజుద్దీన్‌కి ఆ తర్వాత బోలెడు అవకాశాలు తలుపు తట్టిన సంగతి తెలిసిందే. అలాగే తాజాగా నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించనున్న ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో అతడి సరసన నటించాల్సిందిగ తాప్సీని కోరగా ఆమె అతడితో నటించను అని ఖరాఖండిగా చెప్పేసిందనేది ఆ వార్తల సారాంశం.

 

ఈ టాక్‌తో ఒక్కసారిగా తాప్సీ పన్ను పేరు మీడియాలో మార్మోగిపోయింది. ప్రతిభ కలిగిన నటుడితో కలిసి నటించేందుకు నో చెప్పిన తాప్సీ పన్ను అంటూ మీడియాలో వస్తోన్న కథనాలను చూసి షాకైన అమ్మడు ట్విటర్ ద్వారా మీడియాపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. మీ చేతిలో ఉన్న పవర్‌ఫుల్ పెన్ను ఉపయోగించే ముందు ఒకసారి అవతలి వ్యక్తుల నుంచి వివరణ తీసుకోవాల్సిన అవసరం లేదా అని మీడియాను ఏకిపారేసింది తాప్సి. తాను నవాజుద్దీన్ సినిమాను తిరస్కరించానని వస్తోన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు అని పరోక్షంగా చెబుతూ మీడియా బాధ్యాతారాహిత్యంగా వ్యవహరించిందని ట్విటర్‌లో మీడియాపై రుసరుసలాడింది తాప్సీ. 

Trending News