Tantra - ananya nagalla: అనన్య నాగళ్ల తెలుగులో ఇపుడిపుడే కథానాయికగా తెచ్చుకుంటోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'వకీల్ సాబ్' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె పలు సినిమాల్లో కథానాయికగా నటిస్తూ తన లక్ పరీక్షించుకుంటోంది. ఈ కోవలో ఈమె 'తంత్ర' మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసాయి. ఈ సినిమాతో శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై నరేష్ బాబు పి, రవి చైతన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మార్చి 15న ఈ మూవీ గ్రాండ్‌గా విడుదలౌతుంది.
తంత్ర సినిమాను రామాయణం యుధ్దకాండ నేపథ్యంలో తెరకెక్కించారు.'రామ రావణ యుద్ధంలో రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు, నికుంబళ దేవికి పూజ చేస్తున్నపుడు లక్ష్మణుడు ఆ పూజని పూర్తి చేయకుండా వానర సైన్యంతో అడ్డకున్నాడు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే నికుంబళ దేవి ఒక క్షుద్రదేవత.మొత్తంగా రామాయణ కాలం నుంచి నడుస్తోన్న తాంత్రిక పూజల గురించే చెప్పే టెర్రిఫిక్ ఎపిసోడ్ తో ఈ ట్రైలర్‌ను కట్ చేసారు.
ఈ సినిమాలో అనన్య నాగళ్ల ఇంట్రడక్షన్ సీన్స్, ఆ తర్వాత వచ్చే తాంత్రిక విధానాల సీక్వెన్స్ బాగున్నాయి. మధ్యలో అనన్య, ధనుశ్ ప్రేమకథను చాలా నేచురల్‌గా చూపించారు.సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ పాత్రలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి తాంత్రిక విద్యల్లో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు. కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మొత్తంగా ట్రైలర్‌తోనే ఈ సినిమాపై అంచనాలు పెంచేలా చేసాయి.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కథానాయిక అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. 'తంత్ర' ట్రైలర్ ప్రేక్షకులకు నచ్చడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. నా కెరీర్లోనే చాలా డిఫరెంట్ మూవీ ఇది. నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుందనే నమ్మకం వుంది. ఈ సినిమాతో వకీల్ సాబ్ అనన్య, మల్లేశం అనన్యకి బదులు తంత్ర అనన్య అని పిలుస్తారనే నమ్మకం వ్యక్తం చేసింది. సినిమా చాలా బాగా వచ్చిందన్నారు. చాలా మంచి కంటెంట్ తో వస్తున్నాం. విడుదల తర్వాత సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేసింది. సినిమా అంతా చాలా గ్రిప్పింగ్ గా వుంటుంది. మార్చి 15న విడుదల కాబోతుంది. అందరూ ఈ సినిమా చూసి తప్పకుండా ఆదరించాలన్నారు.
అందరు నెక్స్ట్ వకీల్ సాబ్ అనన్య, మల్లేశం అనన్య అనే బదులు...తంత్ర అనన్య అని పిలుస్తారని ఆశిస్తున్నాను! ~ Actress @AnanyaNagalla at #TantraMovie Trailer launch event ❤️🔥
Trailer Out Now 💥😈 - https://t.co/BvwGKgLBDL@AnanyaNagalla @dhanush_vk #Salloni @srini_gopisetti… pic.twitter.com/euvGpw6iaS
— Madhu VR (@vrmadhu9) February 29, 2024
హీరో ధనుష్ రఘుముద్రి మాట్లాడుతూ.. ప్రతి ఒక్క యాక్టర్ కి తంత్ర లాంటి సినిమాలతో యాక్టర్ గా తామేంటో ప్రూవ్ చేసుకుంటామన్నారు. చాలా ముఖ్యం. ఇందులో చాలా కొత్త విషయాలు, ఆసక్తికరమైన అంశాలు వున్నాయన్నారు. దర్శకుడు శ్రీనివాస్ చాలా మంచి పర్ఫామెన్స్ రాబట్టుకున్నారు. ఈ సినిమాతో చాలా మంది నటీనటులతో కలసి పనిచేసే అవకాశం వచ్చిందన్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో హారర్ తో పాటు రోమాన్స్ సెంటిమెంట్ అంశాలు అన్నీ వున్నాయి.
దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి మాట్లాడుతూ.. ప్రపంచీకరణ పేరుతో మనం మన మూలాల్ని, విజ్ఞానాన్ని కోల్పోయాము. అలా కోల్పోయిన ఓ విజ్ఞానమే ఈ తంత్ర శాస్త్రం. కానీ తంత్ర శాస్త్రం అంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంది. కానీ కానీ తంత్ర అనేది కూడా ఒక పూజా విధానం మాత్రమే. తాంత్రిక శాస్త్రంలోని విస్తుగొలిపే రహస్యాలు చూపించాలని ఈ సినిమా చేసానన్నారు. ఇంటి ముందు వేసే ముగ్గు, దిష్టి తీయడం, వెహికిల్స్ నిమ్మకాయలు కట్టడం ఇవన్నీ తాంత్రిక ఆచారాల్లో భాగాలే అన్నారు. వామాచారం ఈ తాంత్రిక విధానంలో బాగం. దీనిని అఘోరాలు చేస్తారు. వాళ్ళు చేసేది పాజిటివ్ గా వుంటుంది. కానీ మన ఆలోచన క్షుద్రమైతే ఈ తాంత్రిక పూజ క్షుద్రపూజ అయిపోతుందన్నారు. ప్రతి తాంత్రిక పూజ నెగిటివ్ కాదు. ఆలాంటి అంశాలన్నీ ఈ మూవీలో చూపించబోతున్నాము. అనన్య పల్లెటూరి అమ్మాయి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయి నటించింది. ఆమె పాత్రలో చాలా డెప్త్ వుంటుంది. ధనుష్ రఘుముద్రి శ్రీహరి తమ్ముడు కుమారుడు. ఆయన నట వారసత్వాన్ని ధనుష్ కొనసాగిస్తారని ఈ సందర్భంగా చెప్పారు. ఈ సినిమా తప్పకుండా అందరినీ అలరించేలా వుంటుందన్నారు.
Also Read: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..
Also Read: PPF Investment: రోజుకు 400 రూపాయలు పెట్టుబడితో 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter