Godfather: గాడ్ ఫాదర్‌లో అన్నాచెల్లెళ్లుగా చిరంజీవి, నయనతార.. లీక్ చేసిన తమన్...

Chiranjeevi Godfather: గాడ్ ఫాదర్ సినిమాలో చిరు, నయన్ రోల్స్‌ను లీక్ చేశాడు తమన్. ఈ ఇద్దరు అన్నాచెల్లెళ్ల పాత్రలో కనిపించనున్నట్లు లీక్ ఇచ్చేశాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 19, 2022, 09:32 AM IST
  • గాడ్ ఫాదర్ సినిమాపై పెద్ద లీక్
  • సినిమాలో అన్నాచెల్లెళ్లుగా చిరు, నయనతార
  • ఇండియన్ ఐడల్ తెలుగు ఫినాలేలో లీక్ చేసిన తమన్
Godfather: గాడ్ ఫాదర్‌లో అన్నాచెల్లెళ్లుగా చిరంజీవి, నయనతార.. లీక్ చేసిన తమన్...

Chiranjeevi Godfather: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఆచార్య డిజాస్టర్‌ అవడంతో ఆయన నుంచి హిట్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం గాడ్ ఫాదర్, బోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాల్లో చిరంజీవి నటిస్తున్నారు. తాజాగా గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి ఓ కీలక విషయాన్ని లీక్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. 'గాడ్ ఫాదర్' సినిమాలో చిరంజీవి-నయనతార అన్నాచెల్లెళ్లుగా నటిస్తున్నట్లు చెప్పాడు.

ఆహా ఓటీటీ వేదికగా నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ తెలుగుకి జడ్జిగా వ్యవహరిస్తున్న తమన్.. మెగా ఫినాలే సందర్భంగా 'గాడ్ ఫాదర్' సినిమా గురించి లీక్ ఇచ్చాడు. ఈ మెగా ఫినాలేకి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విన్నర్ వాగ్దేవికి చిరు బహుమతి అందజేశారు. అంతేకాదు, త్వరలో తన సినిమాలో వాగ్దేవి పాట పాడబోతుందంటూ సర్‌ప్రైజ్ ఇచ్చారు. చిరంజీవి పాట వరకు మాత్రమే చెప్పగా.. తమన్ మరో అడుగు ముందుకేసి పెద్ద లీక్ ఇచ్చాడు.

గాడ్ ఫాదర్ సినిమాలో చిరు-నయనతార మధ్య వచ్చే అన్నాచెల్లెళ్ల పాటను వాగ్దేవి పాడబోతున్నట్లు తమన్ చెప్పాడు. అంటే.. ఈ సినిమాలో చిరు, నయనతార అన్నాచెల్లెళ్లుగా కనిపించబోతున్నారని చెప్పకనే చెప్పేశాడు. గతంలో చిరంజీవి ఇలాగే ఆచార్య, వాల్తేరు వీరయ్య సినిమా టైటిల్స్‌ను లీక్ చేసిన సంగతి తెలిసిందే. మాటల సందర్భంలో చిరు అనుకోకుండా ఆ టైటిల్స్‌ను రివీల్ చేశాడు. ఇప్పుడు తమన్ చిరు సినిమాపై ఇచ్చిన లీక్.. సోషల్ మీడియాలో వీడియో రూపంలో తెగ వైరల్ అవుతోంది.

కాగా, మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన మమ్ముట్టి 'లూసిఫర్' సినిమాను చిరు 'గాడ్ ఫాదర్' పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది. 

Also Read: KTR MEET JUPALLI: అసంతృప్త నేతలకు తాయిలాలు.. బుజ్జగింపులు! టీఆర్ఎస్ లో కొత్త సీన్... కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందా?

 

Also Read: Gold Price Today: స్వల్పంగా దిగొచ్చిన బంగారం ధర.. ఆయా నగరాల్లో ధరల వివరాలివే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News