Thamanna Bouncers attacked: మీడియా ప్రతినిధులపై తమన్నా బౌన్సర్లు దాడి!

Thamanna Bouncers attacked on telugu media persons at Annapurna Studios: తమన్నా బౌన్సర్లు తెలుగు మీడియా ప్రతినిధుల మీద దాడి చేశారు. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 17, 2022, 03:41 PM IST
Thamanna Bouncers attacked: మీడియా ప్రతినిధులపై తమన్నా బౌన్సర్లు దాడి!

Thamanna Bouncers attacked on telugu media persons at Annapurna Studios: తాజాగా హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో తెలుగు సినీ జర్నలిస్టుల మీద హీరోయిన్ తమన్నా బౌన్సర్లు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. తమన్నా ప్రధాన పాత్రలో బాలీవుడ్ స్టార్ మేకర్ మధుర్ బండార్కర్ బబ్లీ బౌన్సర్ అనే సినిమాను రూపొందించారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ జంగ్లీ పిక్చర్స్ బ్యానర్ల మీద ఈ సినిమాని భారీ బడ్జెట్ తో రూపొందించారు.

ఈ సినిమాలో ఎలా అయినా కష్టపడి డబ్బు సంపాదించాలని ఢిల్లీ వెళ్లిన ఒక పేద అమ్మాయి పాత్రలో తమన్నా నటించారు. ఈ సినిమాలో బౌన్సర్ గా మారిన అమ్మాయిగా తమన్నా ఒక కీలక పాత్ర పోషించారు ఈ సినిమా ఓటీటీ వేదికగా సెప్టెంబర్ 23వ తేదీ విడుదలవుతోంది.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా డిస్నీ+హాట్ స్టార్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పెద్ద ఎత్తున జరుగుతుండగా హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ బాల్ రూమ్లో సినిమా యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

ఈ ప్రెస్ మీట్ కి హీరోయిన్ తమన్నా భాటియా, సినిమా దర్శకుడు మధుర్ బండార్కర్ సహా సినిమా టీం హాజరైంది. హాజరైన తర్వాత మీడియాతో ఇంటరాక్షన్ పూర్తయి తమన్నా లేచి వెళ్లి పోతుండగా ఆమెను ఫోటోలు తీసేందుకు, పలు ప్రశ్నలు సందించేందుకు తెలుగు మీడియా ప్రతినిధులు ప్రయత్నించినట్లు సమాచారం. కొంతమంది ఫోటోగ్రాఫర్లు తమన్నాను ఫోటో తీయడానికి ప్రయత్నించగా తమన్నా కోసం వచ్చిన బౌన్సర్లు వారి మీద దాడి చేసినట్లుగా తెలుస్తోంది.

దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కావాలని తమన్నాని ఇబ్బంది పెట్టడానికి మీడియా ప్రతినిధులు ప్రయత్నించారని బౌన్సర్లు ఆరోపిస్తుంటే అదేమీ లేదని కావాలని బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించి తమ మీద దాడికి పాల్పడ్డారని తాము గాయాల పాలయ్యామని మీడియా ప్రతినిధులు చెబుతున్నారు.

Also Read: Bigg Boss 6 Eliminatation: మరో షాకివ్వబోతున్న బిగ్ బాస్.. రెండో వారంలో ట్విస్ట్

Also Read: Unstoppable With NBK Season 2: అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ కి అంతా రెడీ... అప్పటి నుంచే స్ట్రీమింగ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News