AP: అక్కడ ధియేటర్లు తెర్చుకున్నాయి కదా..త్వరలో మిగిలినవి కూడా

కరోనా వైరస్ కారణంగా మార్చ్ నుంచి మూతపడిన ధియేటర్లను తెరిచేందుకు కేంద్రం అనుమతిచ్చినా తెలుగు రాష్ట్రాల్లో తెర్చుకోలేదు.  ధియేటర్ యాజమాన్యాల నిరసన కారణంగా అన్నిచోట్లా ఆగినా..అక్కడ మాత్రం తెర్చుకున్నాయి.

Last Updated : Nov 1, 2020, 11:41 PM IST
AP: అక్కడ ధియేటర్లు తెర్చుకున్నాయి కదా..త్వరలో మిగిలినవి కూడా

కరోనా వైరస్ ( Corona virus ) కారణంగా మార్చ్ నుంచి మూతపడిన ధియేటర్లను తెరిచేందుకు కేంద్రం అనుమతిచ్చినా ( Central Government ) తెలుగు రాష్ట్రాల్లో తెర్చుకోలేదు.  ధియేటర్ యాజమాన్యాల నిరసన ( Theatres strike ) కారణంగా అన్నిచోట్లా ఆగినా..అక్కడ మాత్రం తెర్చుకున్నాయి.

కరోనా వైరస్ కారణంగా మార్చ్ నెల నుంచి దేశవ్యాప్తంగా ధియేటర్లు మూతపడ్డాయి. అన్ లాక్ ప్రక్రియ ( Unlock process ) లో భాగంగా అక్టోబర్ 15 నుంచి 50 శాతం ఆక్యుపెన్సీతో తెర్చుకోవచ్చని కేంద్రం అనుమతిచ్చింది. అయితే ఇన్నాళ్లూ లాక్డౌన్ ( lockdown period ) కాలంలో విధించిన కరెంటు బిల్లుల్ని మాఫీ చేయాలనే డిమాండ్ తో పాటు మరి కొన్ని కోర్కెల్ని తెలుగురాష్ట్రాల్లో ప్రభుత్వాల ముందుంచాయి ధియేటర్ యాజమాన్యాలు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ధియేటర్లు తెరవకూడదని నిర్ణయం తీసుకున్నాయి.

అటు కర్నాటక ( Karnataka ) వంటి కొన్ని రాష్ట్రాల్లో ధియేటర్లు తెరిచినా...50 శాతం ఆక్యుపెన్సీ కారణంగా గిట్టుబాటు కాక మళ్లీ మూసేశారు. అక్టోబర్ 15 నుంచి ధియేటర్లు తెర్చుకుంటాయనే ఆశ కాస్తా నీరుగారిపోయింది. అయితే కొన్నిచోట్ల ఎగ్జిబిటర్లు ఇప్పటికే ధియేటర్లను తెరిచేశారు. నవంబర్ 1 నుంచి విజయవాడ ( Vijayawada ) లో కొన్ని ధియేటర్లు, రాష్ట్రంలోని కొన్ని మల్టీప్లెక్సులు, విశాఖపట్నంలో ( Visakhapatnam ) జగదాంబ ధియేటర్ కాంప్లెక్స్ తెర్చుకున్నాయి. 

ప్రస్తుతానికి ఇటీవల విడుదలైన సినిమాలనే ప్రదర్శిస్తున్నారు. ప్రేక్షకుల సంఖ్యను బట్టి ధియేటర్లు ప్రారంభిస్తామని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. గతంతో పోలిస్తే కరోనా వైరస్ తగ్గిన నేపధ్యంలో త్వరలోనే తమ మంకుపట్టును వదిలేసి ధియేటర్లు తెరిచేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే కొత్త సినిమాలు ఇప్పటికే షెడ్యూల్ అవుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే సోలో బ్రతుకే సో బెటరు మూవీని డిసెంబర్ నెలలో విడుదల చేయాలనే ఆలోచన ఉంది. ఇక సంక్రాంతి నేపధ్యంలో మరిన్ని సినిమాలు విడుదల కావల్సి ఉన్నాయి. మరి అప్పటివరకూ పరిస్థితి సెట్ అవ్వాలంటే..ఇప్పుడిక థియేటర్లు తెరవాల్సిందేననేది ఎగ్జిబిటర్ల ఆలోచన. Also read: Shakuntalam story: శాకుంతలం కథ ఏంటో తెలుసా ?

Trending News