Pushpa Movie: అత్యంత సన్నిహితులకు విదేశాల్లో పుష్ప సక్సెస్ పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్

Pushpa Movie: పుష్ప సినిమా భారీ విజయంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తగ్గేదే లే అంటున్నాడు. అత్యంత సన్నిహితమైన అతి కొద్దిమంది స్నేహితులకు విదేశాల్లో గ్రాండ్ పార్టీ ఇచ్చాడు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 9, 2022, 12:21 PM IST
 Pushpa Movie: అత్యంత సన్నిహితులకు విదేశాల్లో పుష్ప సక్సెస్ పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్

Pushpa Movie: పుష్ప సినిమా భారీ విజయంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తగ్గేదే లే అంటున్నాడు. అత్యంత సన్నిహితమైన అతి కొద్దిమంది స్నేహితులకు విదేశాల్లో గ్రాండ్ పార్టీ ఇచ్చాడు.

పుష్ప మూవీ ఎంతటి హిట్ సాధించిందో అందరికీ తెలుసు. పుష్ప సినిమా పాటలకు దేశ విదేశాల్లోని ప్రముఖులు స్టెప్పులేసి సంచలనం రేపారు. ప్రపంచమంతా పుష్ప మేనియా పట్టుకుంది. పుష్ప హిట్‌తో అల్లు అర్జున్ క్రేజ్ విదేశాలకు సైతం విస్తరించింది. పుష్ప సినిమా గ్రాండ్ సక్సెస్ కావడంతో అల్లు అర్జున్ ఆనందానికి హద్దుల్లేవు. 40వ ఏట అడుగెట్టిన అల్లు అర్జున్ తనకు అత్యంత సన్నిహితంగా ఉండే అతికొద్దిమంది స్నేహితులకు విదేశాల్లో పార్టీ ఇచ్చాడు.

సెర్బియా, బెల్‌గ్రేడ్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లో కేవలం 50 మందిని పిలిచి తన భార్య స్నేహారెడ్డితో కేక్ కట్ చేయించాడు అల్లు అర్జున్. ఈ గ్రాండ్ పార్టీకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా విషయానికి వస్తే..త్వరలో షూటింగ్ పనుల్లో బిజీ కానున్నాడు. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప 2 జూన్ జూలై నెలల్లో పట్టాలెక్కవచ్చని తెలుస్తోంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ALLU ARJUN (@alluarjunonnline_)

Also read: The Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ నిర్మాతతో సినిమాకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్, సినిమాపై ప్రశంసలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News