Chiranjeevi Mother Anjanamma : అంజనమ్మ ఆధ్వర్యంలో ఆదివారం లంచ్‌.. ఇంకేం కావాలంటూ ఉపాసన ఎమోషనల్

Anjanamma Cooking Video చిరంజీవి తల్లి అంజనమ్మ తాజాగా వంట వండినట్టు కనిపిస్తోంది. తన మనవరాలి కోసం, రామ్ చరణ్‌కు పుట్టబోయే కొడుకు, తన ముని మనవడి కోసం ఇలా స్పెషల్‌గా వండినట్టుగా కనిపిస్తోంది. దగ్గరుండి మరీ ఉపాసన కోసం స్పెషల్‌గా వంట చేయించినట్టుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 16, 2023, 05:14 PM IST
  • నెట్టింట్లో అంజనమ్మ వీడియో వైరల్
  • ప్రేమగా లంచ్ వండి పెట్టిన చిరు మదర్
  • ఉపాసన కోసం స్పెషల్ వంటకం
Chiranjeevi Mother Anjanamma : అంజనమ్మ ఆధ్వర్యంలో ఆదివారం లంచ్‌.. ఇంకేం కావాలంటూ ఉపాసన ఎమోషనల్

Chiranjeevi Mother Anjanamma Cooking మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌లు దగ్గరదగ్గరే నివాసం ఉంటారన్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే రామ్ చరణ్‌, ఉపాసనలు తమకు నచ్చినట్టుగా ఇంటిని కట్టుకున్న విషయం విధితమే. అయితే రామ్ చరణ్‌, ఉపాసనలు ఈ సండే నాడు చిరంజీవి ఇంటికి వచ్చి గడుపుతున్నట్టుగా కనిపిస్తోంది. చిరంజీవి తన తల్లి అంజనమ్మ, భార్య సురేఖలతో కలిసి ఉంటాడన్న విషయం తెలిసిందే.

అయితే ఈ సండే నాడు స్పెషల్‌గా అంజనమ్మ దగ్గరుండి వంట చేయించినట్టుగా కనిపిస్తోంది. ఆమె ఆధ్వర్యంలోనే వంట చేసినట్టుగా కనిపిస్తోంది. చూస్తుంటే ఈ వంటకం ఉపాసన కోసం స్పెషల్‌గా చేయించినట్టుగా అనిపిస్తోంది. తాజాగా ఉపాసన ఓ వీడియోను షేర్ చేయగా.. అందులో అంజనమ్మ ఆర్డర్లు కనిపిస్తున్నాయి. అలా వేయి.. ఇలా వేయి.. ఇప్పుడు వేయి అన్నట్టుగా కనిపిస్తోంది.

 

ఇక అంజనమ్మ స్పెషల్‌గా పులావ్ చేయించింది. ఈ వీడియోను ఉపాసన షేర్ చేసింది. నాయనమ్మ.. సండే పులావ్‌ను ఎంతో ప్రేమతో చేసింది.. ఇంతకంటే ఏం అడగాలి.. ఏం కావాలి అంటూ ఉపాసన ఉప్పొంగిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా కోడలి ప్రేమకు, అంజనమ్మ కేరింగ్‌కు అంతా ఫిదా అవుతున్నారు.

Also Read:  Prabhas Salaar : రెండు పార్టులుగా సలార్!.. సీక్రెట్ రివీల్ చేసిన విలన్ దేవరాజ్

ఉపాసన త్వరలోనే  మెగా ఫ్యామిలీకి వారసుడ్ని ఇవ్వబోతోంది. అందరూ అయితే రామ్ చరణ్‌కు కొడుకు పుట్టాలని కోరుకుంటున్నారు. సుష్మిత సైతం అదే చెప్పేసింది. ఇప్పటికే తమ ఇంట్లో తనకు, తన చెల్లికి అంతా కూడా ఆడపిల్లలే పుట్టారని, రామ్ చరణ్‌కి అయినా బాబు పుట్టాలని కోరుకుంది. బాబు పుడితే ఎంతో ఆనందంగా అనిపిస్తుందన్నట్టుగా సుష్మిత చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: Samantha Shaakuntalam : శాకుంతలం పరిస్థితి ఇంతలా దిగజారిందా?.. ఇదే నిదర్శనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x