RRR Update: ఆర్ఆర్ఆర్ ఎత్తర జెండా ఆంథెమ్ సాంగ్ వాయిదా.. ప్రీ రిలీజ్ ఎప్పుడంటే..??

కరోనా కారణంగా, టికెట్ ధరల జీవోతో పలు సార్లు వాయిదా పడిన ఆర్ఆర్ఆర్ సినిమా చివరగా మార్చ్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబందించిన అప్డేట్ వచ్చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 14, 2022, 05:11 PM IST
  • భారీ యెత్తున ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్
  • మార్చి 20న ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించే అవకాశం
  • మార్చి 25న విడుదల కానున్న ఆర్ఆర్‌ఆర్‌ చిత్రం
  • ఆంథెమ్ సాంగ్ విడుదల 15ఉదయం 10కి వాయిదా
  • సాంకేతిక కారణాలతో పాటను వాయిదా వేసిన యూనిట్
RRR Update: ఆర్ఆర్ఆర్ ఎత్తర జెండా ఆంథెమ్ సాంగ్ వాయిదా.. ప్రీ రిలీజ్ ఎప్పుడంటే..??

RRR Update: 1920ల్లో పుట్టిన సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమురంభీంల జీవిత కథలకు.. ఫిక్షన్‌ జోడించి రాజమౌళి తెరకెక్కించిన మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌. ఎన్‌టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీ మార్చి 25న థియేటర్లలో సందడి చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. మార్చి 20న గ్రాండ్ గా ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు చిక్‌బల్లాపూర్‌లో ఈ ఈవెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అటు ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ప్రి రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా నిర్మాత దానయ్య, దర్శకుడు జక్కన్న విజయవాడకు వెళ్లొచ్చారు.

ఇక ఇవాళ విడుదల కావాల్సిన... ఆర్‌ఆర్‌ఆర్‌ యాంథెమ్ సాంగ్‌ను సాంకేతిక కారణాలతో వాయిదా వేశారు. మంగళవారం ఉదయం పది గంటలకు విడుదల చేస్తామని తెలిపారు. ఈ ఎత్తర జెండా ఆంథెమ్ సాంగ్ టీజర్‌లో ఆలియా... ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి స్టెప్పులేసింది. చాలా ప్రెట్టీగా కనిపిస్తోందంటూ అభిమానులు ఆలియాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వందేమాతరం అని రాసిన జెండా ఎగరేస్తూ దేశ భక్తిని చాటారు. సీత పాత్రలో నటిస్తున్న ఆలియా ఈ సాంగ్‌లో పింక్ కలర్ చీరలో వెరైటీ హెయిర్ స్టయిల్‌లో ఆకర్షణీయంగా కనిపించింది.

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం థియేటర్లలో విడుదలైన 75 నుంచి 90 రోజుల్లోనే ఓటీటీల్లో విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మళయాల వెర్షన్లు జీ5లో విడుదల కానున్నాయి. ఇక ఆర్ఆర్‌ఆర్‌ హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. 2021డిసెంబర్‌లో రిలీజైన ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్ ఇప్పటికే ఫుల్ హైప్ క్రియేట్ చేసింది. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న రిలీజ్ కావాల్సి ఉన్నా... పాండెమిక్ ఎఫెక్ట్, టికెట్ ధరల జీవోతో వాయిదా పడింది. ఫైనల్‌గా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్దమైంది. 

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో అజయ్ దేవ్ గన్, శ్రియ, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, సముద్రఖని, ఎలిసన్ డూడీ, రే స్టీవెన్సన్‌,  ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించారు. భారతీయ సినిమా చరిత్రలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా కోసం ఎంతో ఈగర్‌ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Also Read: Janasena Formation Day: ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు జనసేన ఆవిర్భావ సభకు నో ఎంట్రీ..? పోస్టర్స్ వైరల్

Also Read: Washing Machine Offers: ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.7 వేల బడ్జెట్ లో అమ్మకానికి వాషింగ్ మెషీన్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Facebook , Twitterమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News