Vakeel Saab: వకీల్ సాబ్ విడుదలపై లేటెస్ట్ అప్‌డేట్స్

పవన్ కళ్యాణ్ నటిస్తున్న Vakeel saab movie లాక్ డౌన్‌కి ముందే 70 శాతం షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. మిగిలిన షూటింగ్‌ని పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ కోసం డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఎదురుచూస్తున్నాడు.

Last Updated : Feb 22, 2024, 11:00 AM IST
Vakeel Saab: వకీల్ సాబ్ విడుదలపై లేటెస్ట్ అప్‌డేట్స్

పవన్ కళ్యాణ్ నటిస్తున్న Vakeel saab movie లాక్ డౌన్‌కి ముందే 70 శాతం షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. మిగిలిన షూటింగ్‌ని పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ కోసం డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఎదురుచూస్తున్నాడు. పవన్ కళ్యాణ్‌పై ( Pawan Kalyan) కొన్ని కోర్టు సన్నివేశాలు, మరో ఫైట్ సీన్, ఒక పాట, లీడింగ్ లేడీ ఉన్న పలు సన్నివేశాల చిత్రీకరణ పెండింగ్‌లో ఉన్నాయి. Also read : Pakistan vs Saudi Arabia: పాకిస్థాన్‌కి సౌది అరేబియా భారీ షాక్

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్‌లు న్యాయవాదులుగా కనిపించనుండగా మరో ముఖ్యమైన పాత్రలో నివేదా థామస్ ( Nivetha Thomas) నటిస్తోంది. హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సి ప్రధాన పాత్రల్లో రూపొందిన పింక్ అనే బాలీవుడ్ మూవీకి ( Pink movie Telugu remake ) తెలుగు రీమేక్‌గా వకీల్ సాబ్ తెరకెక్కుతోంది. వకీల్ సాబ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ పూర్తి చేయాలని, అలాగే అసంపూర్తిగా ఉన్న ట్రాక్‌లను కంపోజ్ చేసే పనిలో ఎస్ఎస్ తమన్‌ ( SS Thaman) బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఎస్ఎస్ థమన్ కంపోజ్ చేసిన మగువా మగువా అనే సాంగ్ ( Maguva maguva song ) మ్యూజిక్ ప్రపంచంలో ఓ పెను సంచలనం సృష్టించిన సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. Also read : Rhea Chakraborty: సుశాంత్ గాళ్‌ఫ్రెండ్ కాల్ డేటాలో రానా, రకుల్, అమీర్ ఖాన్ పేర్లు

పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే, వకీల్ సాబ్ బృందం షూటింగ్ పూర్తి చేసి సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. డిసెంబర్, జనవరి మధ్య ఈ సినిమా ను విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు టాలీవుడ్ టాక్. Also read : SS Rajamouli: గుడ్ న్యూస్ చెప్పిన రాజమౌళి

Trending News