Vishnu Vishal Divorce : గుత్తాజ్వాలతో విడాకులు.. స్పందించిన విష్ణు విశాల్.. దాని ఉద్దేశం అది కాదట!

Vishnu Vishal Divorce Rumors విష్ణు విశాల్ తాజాగా తన మీద వస్తోన్న రూమర్ల గురించి స్పందించాడు. విష్ణు విశాల్ ఇప్పుడు తన మీద వచ్చిన విడాకుల రూమర్లను కొట్టి పారేశాడు. విష్ణు విశాల్ ఇప్పుడు ట్విట్టర్‌లో వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 27, 2023, 10:45 AM IST
  • తెరపైకి విష్ణు విశాల్ గుత్తా జ్వాల
  • రెండో పెళ్లి సైతం పెటాకలా?
  • క్లారిటీ ఇచ్చిన విష్ణు విశాల్
Vishnu Vishal Divorce : గుత్తాజ్వాలతో విడాకులు.. స్పందించిన విష్ణు విశాల్.. దాని ఉద్దేశం అది కాదట!

Vishnu Vishal Divorce Rumors విష్ణు విశాల్ గుత్తా జ్వాలలు విడాకులు తీసుకోబోతోన్నారనే టాక్ గత నాలుగైదు రోజులుగా ఎక్కువగా వినిపిస్తోంది. దానికి కారణం విష్ణు విశాల్ వేసిన ఓ ట్వీటే. ఆ ట్వీట్‌లో విష్ణు విశాల్ ఇలా చెప్పుకొచ్చాడు. నేను మళ్లీ ప్రయత్నించాను. నేను మళ్లీ ఓడిపోయాను.. మళ్లీ ఓ గుణపాఠం నేర్చుకున్నాను.. చివరగా నా వల్లే ఫెయిల్ అయింది.. అది నా తప్పే.. అంటూ ఇలా చెప్పుకొచ్చాడు విష్ణు విశాల్.

దీంతో జనాలు ఇది తన పర్సనల్ లైఫ్ గురించి చెబుతున్నాడని, గుత్వా జ్వాలతోనూ విడాకులు జరుగుతాయని, ఇద్దరి మధ్య విబేధాలు వచ్చి ఉంటాయని జనాలు అనుకోసాగారు. దీంతో తాను వేసిన ట్వీట్ అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారని తెలుసుకున్నాడు విష్ణు విశాల్. ఈ రూమర్లు తన దగ్గరకు వెళ్లడంతో ఇలా క్లారిటీ ఇచ్చేసుకున్నాడు.

 

గత కొన్ని రోజుల క్రితం నేను వేసిన ట్వీట్‌ను దారుణంగా, తప్పుగా అర్థం చేసుకున్నారు.. అది నా వృత్తిపరంగా వేశాను.. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కాదు.. మా ఇద్దరి మధ్య ఎంతో నమ్మకం ఉంది.. అదే మాకు అండ.. మనం ఎప్పుడైనా ఫెయిల్ అయితే.. మనల్ని మనమే తిట్టుకుంటాం.. మనం మీద మనం అంతటి ద్వేషాన్ని ప్రదర్శించకూడదు.. అదే నేను చెప్పాలని అనుకున్నా.. అంతా క్షేమంగానే ఉన్నాం.. మేం అంతా బాగానే ఉన్నామని చెప్పుకొచ్చాడు.

విష్ణు విశాల్ చివరగా మట్టి కుస్తీ అనే సినిమాతో వచ్చాడు. అయితే ఈ సినిమా యావరేజ్‌ టాక్‌తో మిగిలిపోయింది. కమర్షియల్‌గా అంత పెద్ద విజయాన్ని అయితే సాధించలేదు. తమిళ, తెలుగు అంటూ ఇలా సౌత్ భాషల్లో రిలీజ్ చేసిన ఈ సినిమా అంతగా సక్సెస్ అవ్వలేదు. ఈ మూవీ గురించే విష్ణు విశాల్ ట్వీట్ చేసి ఉంటాడని జనాలు అనుకుంటున్నారు. ఎఫ్ఐఆర్ సినిమా మాత్రం అటు తమిళ్, ఇటు తెలుగులో బాగానే సక్సెస్ అయింది.

Also Read:  RC 15 Title : రామ్ చరణ్‌కి నిజంగానే 'గేమ్ చేంజర్'.. కథ ఏంటో చెప్పేసిన శంకర్

Also Read: Ram Charan Birthday : రామ్ చరణ్‌లో నాకు నచ్చింది అదే.. నాగబాబు కామెంట్స్.. జన సైనికుల ఆకతాయి పనులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News