కళ్యాణ వైభోగం,9 ఆగస్ట్, 2018 ఎపిసోడ్: చలమయ్యను చంపేద్దామంటున్న నిత్య !

Updated: Aug 10, 2018, 08:24 PM IST
కళ్యాణ వైభోగం,9 ఆగస్ట్, 2018 ఎపిసోడ్: చలమయ్యను చంపేద్దామంటున్న నిత్య !
ZEE5 image

మీ అభిమాన ZEE తెలుగులో మీరు అభిమానించే కళ్యాణ వైభోగం తాజా ఎపిసోడ్‌లో దేవీపురం గుళ్లోకి వెళ్లిన మంగ, జైలకు వింత అనుభవాలు ఎదురవుతాయి. అక్కడకు వచ్చినప్పుడల్లా, ఏదో ఒక చెడు జరుగుతూ వుందని అంటాడు జై. అది విన్న మంగ కంగారుపడుతుంది. అదే సమయంలో నిత్య, జై ల పేరు చెప్పి అర్చన చేయమంటే, పేర్లలో ఓ దోషం వుంది అంటాడు పూజారి. జై విసుగుతో బయటకు వెళ్లగానే జై, మంగతాయారు పేర్లు చెప్పగానే అవి చక్కగా  సరిపోతాయి. ఏవో ఆలోచనలతో బయటకు వచ్చిన మంగ చీరకు నిప్పు అంటుకుంటుంది. ఎవరో హెచ్చరించడంతో ఈ లోకంలోకి వస్తుంది. తనను తాను రక్షించుకుంటుంది. దోషం ఏదో సరిచేసుకుని పరిహారం చేసుకోమంటాడు పూజారి. 

 

చలమయ్య పంతులును కలుద్దామంటే జై వద్దని ఊళ్లో ఇంటికి తీసుకెళ్తాడు ఆమెను. మరోవైపు నిత్య, స్వరూప దేవీపురం చేరుకుంటారు. దారిలో కలిసిన చారిని పట్టించుకోకుండా వెళ్తారు. చలమయ్య ఊళ్లో లేడని తెలుసుకుంటారు. మూడురోజుల వరకు రాడని తెలుస్తుంది. ఎక్కడకు వెళ్లాడో తెలుసుకుని అక్కడే చంపేద్దామంటుంది నిత్య. మరి నిత్య, స్వరూపల పన్నాగం ఎంత వరకు ఫలించిందో తెలుసుకోవాలంటే కళ్యాణ వైభోగం తాజా ఎపిసోడ్ వీక్షించాల్సిందే. ఈ సీరియల్ పూర్తి ఎపిసోడ్స్‌ని ZEE5లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.