మాటే మంత్రము, 9 ఆగస్ట్, 2018 ఎపిసోడ్ : తులసి, వసుంధర మధ్య మానసిక సంఘర్షణ

మాటే మంత్రము, 9 ఆగస్ట్, 2018 ఎపిసోడ్ : తులసి, వసుంధర మధ్య మానసిక సంఘర్షణ

Updated: Aug 10, 2018, 09:23 PM IST
మాటే మంత్రము, 9 ఆగస్ట్, 2018 ఎపిసోడ్ : తులసి, వసుంధర మధ్య మానసిక సంఘర్షణ
ZEE5 image

మీ అభిమాన జీ తెలుగులో ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న మాటేమంత్రము సీరియల్ తాజా ఎపిసోడ్‌లో ఆస్పత్రిలో చావుబతుకుల్లో ఉన్న తులసిని కాపాడుకోవడం కోసం వసుంధర పడిన ఆవేదన, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను చూడొచ్చు. దారుణమైన పరిస్ధితుల్లో వున్న తల్లి తులసిని కాపాడుకోవడానికి జోగిని పెళ్లాడటానికి సిద్దమవుతుంది వసుంధర. ఆ విషయం తెలుసుకున్న తులసి.. నర్స్‌‌ని పంపించి వసుంధరను లోపలికి పిలిపిస్తుంది. పది లక్షలు చేతిలో పట్టుకుని హాస్పిటల్‌లో చెల్లిస్తానంటుంది అలేఖ్య. వసుంధర జోగిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే, లోపల ఆక్సిజన్ మాస్క్ తీసుకుని చనిపోవడానికైనా తాను సిద్ధమే కానీ నువ్వు జోగిని పెళ్లి చేసుకోవద్దు అని వసుంధరతో ప్రమాణం చేయించుకుంటుంది తులసి. 

 

ఇదిలావుంటే, వసుంధరకు దిక్కుతోచని పరిస్ధితుల్లో వంశీకి ఫోన్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే వంశీ ఫోన్ స్విఛాఫ్‌లో ఉంటుంది. ల్యాండ్ లైన్‌‌కి ఫోన్ చేయగా, ఫోన్ ఎత్తిన వంశీ మరదలు నక్షత్ర.. వసుంధర ఏడుస్తూ తల్లి గురించి చెప్పిన విషయం వింటుంది. వసుంధర దుస్థితిని తనకు అనుకూలంగా మల్చుకోవాలని భావించిన నక్షత్ర.. అంతకు ముందు తాను దొంగతనం చేసిన ఓ చెక్‌ని ఇచ్చి వసుంధరను ఇరికించడానికి బయల్దేరుతుంది. 

మరోవైపు డాక్టర్ ఇచ్చిన సలహాతో నా తల్లిని బతికించుకోవాలి.. సహాయం చేయండి అంటూ బోర్డ్ పెట్టుకుని వసుంధర ఆస్పత్రిలో తిరుగుతున్న వైనం చూపరులని కలచివేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే, మాటే మంత్రం తాజా ఎపిసోడ్ వీక్షించాల్సిందే. ఈ సీరియల్ పూర్తి ఎపిసోడ్స్‌ని ZEE5లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.