నేడే రానా, మిహికాల ఎంగేజ్‌మెంట్!

Rana Daggubati | టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌లలో రానా దగ్గుబాటి ఒకరు. ఇటీవల తన ప్రేమ విషయాన్ని సైతం తెలిపిన రానా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు.

Updated: May 21, 2020, 01:21 PM IST
నేడే రానా, మిహికాల ఎంగేజ్‌మెంట్!
Image Credit: Instagram

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌లలో రానా దగ్గుబాటి ఒకరు. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో కరోనా సీజన్‌తో పాటు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇటీవల నిర్మాత దిల్ రాజు, హీరో నిఖిల్, ‘జబర్దస్త్’ కమెడియన్ మహేష్ వివాహం చేసుకున్నారు. త్వరలో దగ్గుబాటి వారింట సైతం పెళ్లి బాజాలు మోగనున్న విషయం తెలిసిందే. గాంధీ అంటే చాలా గౌరవం, ప్లీజ్ అర్థం చేసుకోండి: నాగబాబు

ఇటీవల తన ప్రేమను మిహికా బజాజ్ ఒప్పుకుందని హీరో రానా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. డిసెంబర్‌లోగా పెళ్లి చేసేస్తామని ప్రముఖ నిర్మాత, రానా తండ్రి సురేష్ బాబు ఇదివరకే స్పష్టం చేశారు. నేడు రానా దగ్గుబాటి, మిహికా బజాజ్‌ల నిశ్చితార్థ వేడుక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో కేవలం ఇరు కుటుంబాల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ చేయనున్నారు. మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

హైదరాబాద్‌కే చెందిన బంటీ బజాజ్, సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె మిహికా. ఆమె చెల్సియా వర్సిటీ నుంచి ఇంటీరియర్ డిజైన్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఇంటీరియర్ డిజైనింగ్‌లో ఉన్న ప్రావీణ్యంతో ‘డ్యూ డ్రాప్ డిజైన్’ అనే ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీని స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు.    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్