స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మాలీవుడ్‌లోనూ బన్నీ డబ్బింగ్ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. అందుకే అల్లు అర్జున్‌కి సైతం కేరళ పట్ల ప్రత్యేక గౌరవం ఉంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌ని కేరళలో జరుగుతున్న 66వ నెహ్రూ ట్రోఫి బోట్ రేసింగ్ పోటీలకు ఆ రాష్ట్ర సర్కార్ ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఇవాళ ఉదయం అల్లు అర్జున్ జండా ఊపి ఆ పోటీలను ప్రారంభించారు. తన భార్య స్నేహా రెడ్డితో సహా వెళ్లిన అల్లు అర్జున్‌కి కేరళలో ఘన స్వాగతం లభించింది. భారీ సంఖ్యలో హాజరైన అభిమానుల మధ్య ఆ పోటీలను ప్రారంభించిన అనంతరం.. తనకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన కేరళ ప్రభుత్వానికి, కేరళ వాసులకు అల్లు అర్జున్ ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు.
I thank the government of Kerala for inviting me and giving me the honour to wave the flag at the 66th Nehru Trophy Boat Race . I heart fully thank the people of Kerala for giving me this Honour. THANK YOU pic.twitter.com/cerFV85qhT
— Allu Arjun (@alluarjun) November 10, 2018
ఇటీవల వరదలతో సర్వం కోల్పోయిన కేరళను ఆదుకునే మహా యజ్ఞంలో భాగంగా అల్లు అర్జున్ సైతం తనవంతుగా రూ.25 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందచేయడం అతడిపై కేరళ వాసుల్లో ఉన్న అభిమానాన్ని రెట్టింపయ్యేలా చేసింది. వరద బాధితులకు అండగా నిలిచేందుకు వెంటనే స్పందించి అల్లు అర్జున్ చేసిన ఆర్థిక సహాయాన్ని ఆ రాష్ట్ర సర్కార్ సైతం మరువలేదు కాబోలు.. ఆయనను ఈ విధంగా ప్రత్యేకంగా గౌరవించి అతడిపై తమకు ఉన్న గౌరవాన్ని చాటుకుంది.
అల్లు అర్జున్‌కి కేరళ సర్కార్ ప్రత్యేక గౌరవం