అల వైకుంఠపురములో టీజర్ విడుదల అప్‌డేట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి చిత్రం అల వైకుంఠపురములో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు అభిమానులను అలరిస్తున్నాయి. తాజాగా సినిమా టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇవాళ సాయంత్ర 4 గంటల 5 నిముషాలకు టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Last Updated : Dec 11, 2019, 03:40 PM IST
అల వైకుంఠపురములో టీజర్ విడుదల అప్‌డేట్

అల్లు అర్జున్ తదుపరి చిత్రం అల వైకుంఠపురములో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు అభిమానులను అలరిస్తున్నాయి. తాజాగా సినిమా టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇవాళ సాయంత్ర 4 గంటల 5 నిముషాలకు టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. నిజానికి ఆదివారమే టీజర్ రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమాని, మెగా అభిమాన సంఘం అధ్యక్షుడు నూర్ బాషా ఆకస్మికంగా మృతి చెందడంతో టీజర్ విడుదలను వాయిదా వేశారు. ఐతే అభిమానులను నిరాశపరచకుండా టీజర్‌లోని గ్లింప్స్‌ను చిత్రయూనిట్ పంచుకుంది. కోటు వేసుకుని టేబుల్‌పై నడుచుకుంటూ వస్తున్న అల్లు అర్జున్ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. 

అల వైకుంఠపురములో ..  సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా నాగార్జున మేనల్లుడు సుశాంత్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. సినిమాలో బన్నీ సరసన పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోంది. త్రివిక్రమ్, బన్నీ కలయికలో వచ్చిన జులాయి, s/o సత్యమూర్తి చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. దీంతో వారిద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. హారిక హాసిని సంస్థతో కలిసి గీతా ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.  మరోవైపు టీజర్ కోసం అల్లు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Trending News