Gopisundar: సింగర్‌ని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్

Gopisundar Married Amrutha Suresh Secretly: మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఒక సింగర్ ఆయనని భర్త అని సంబోదించడంతో ఆ ప్రచారం మొదలయింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 7, 2022, 07:42 PM IST
Gopisundar: సింగర్‌ని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్

Gopisundar Married Amrutha Suresh Secretly: మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ తెలుగులో కూడా అనేక సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించి మంచి పాపులారిటీ సంపాదించారు. నిజానికి ఆయనకు గతంలోనే ప్రియా అనే మహిళతో వివాహం జరిగింది. వీరిద్దరికీ మాధవ్, యాదవ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరికీ దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఏర్పడడంతో వేరువేరుగా ఉంటున్నారు.

పిల్లలు ఇద్దరూ ఆయన భార్య ప్రియ దగ్గరే ఉంటున్నారు. ఆ తరువాత తన మ్యూజిక్ డైరెక్షన్లో సాంగ్స్ పాడిన అభయ అనే సింగర్ తో ప్రేమలో పడిన గోపి సురేష్ సుమారు 12 ఏళ్ల నుంచి ఆమెతో సహజీవనం చేస్తూ వచ్చారు. కానీ వీరిద్దరి మధ్య కూడా ఈమధ్య విభేదాలు రావడంతో వీరు కూడా విడిపోయారు. అయితే ఇప్పుడు ఆయన మరో సింగర్ అమృత సురేష్ తో ప్రేమలో పడ్డారు. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు.

అయితే వీరిద్దరూ ఇప్పుడు రహస్యంగా వివాహం చేసుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దానికి కారణం అమృత సురేష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక పోస్ట్. ఈ మధ్యనే అమృత సురేష్ పుట్టినరోజు జరగడంతో ఆమె తన బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే అందులో తన పుట్టినరోజు వేడుకలు జరిపినందుకు గోపీ సుందర్ కీ ధన్యవాదాలు తెలుపుతూనే అక్కడ భర్త అంటూ ఆయనను సంబోధించడంతో వీరిద్దరికి రహస్యంగా వివాహం జరిగిందని భావిస్తున్నారు.

అయితే నిజానికి అమృత సురేష్ కు గతంలో మలయాళ నటుడు బాలతో వివాహం జరిగింది. వీరిద్దరికీ ఒక కుమార్తె కూడా పుట్టిన తర్వాత విభేదాలు కారణంగా వీరిద్దరూ విడిపోయారు. గోపీసుందర్ ను భర్త అని సంబోధించడంతో వీరిద్దరికీ వివాహం జరిగింది అనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి ఈ విషయం మీద వీరిద్దరూ ఒక క్లారిటీ ఇస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది. 
 Also Read: Nithya Menon: పెళ్లి చేసుకోమని వేధింపులు.. 30 ఫోన్లతో నరకం చూపించాడు.. నిత్య మీనన్ సంచలన ఆరోపణలు!

Also Read: Keerthy Suresh: పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమైన కీర్తి.. వరుడు ఎవరో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News