ముద్దుగుమ్మ బరువు తగ్గిందని మన్ముధుడు గుస్సా !!

హీరోయిన్ రకుల్‌ ప్రీత్ పై నాగ్‌ కు  కోపం వచ్చిందట.. ఆమె బరువు తగ్గడమే అందుకు  కారణమట.. రకుల్ బరువుతో నాగ్ కు ఏం సంబంధం అనుకుంటున్నారా ? అయితే వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది

Updated: Apr 18, 2019, 07:26 PM IST
ముద్దుగుమ్మ బరువు తగ్గిందని మన్ముధుడు గుస్సా !!

రకుల్‌ నటించిన ‘దే దే ప్యార్‌ దే’ చిత్రం కోసం గ్లామరస్ గా కనిపించేందుకు ఆమె పది కిలోలు తగ్గారు. దాంతో ఆమె చూడటానికి మరీ సన్నగా ఉంది. అయితే  ‘మన్మథుడు 2’సినిమాలో నాగ్ సరసన నటించేందుకు రకుల్‌ కాస్త లావుగా కన్పించాల్సి ఉంది. ఏమాత్రం తేడాగా కనిపిస్తే ఎట్రాక్షన్ తగ్గిపోతుంది.

గ్లామర్, ఎట్రాక్షన్ విషయాల్లో ఏమాత్రం కాంప్రమైజ్ కాని నాగ్.. రకుల్ ప్రీత్ పై తన కోపాన్ని అదుపులో చేసుకోలేకపోయారని టాక్. ఇలా రకుల్ పై  నాగ్  కోపగించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చ్ చేస్తున్నాయి

ఇప్పటికే చిత్రీకరణ మొదటి భాగం పోర్చుగల్‌లో జరుగుతోంది. దాంతో బరువు విషయంలో నాగ్‌.. రకుల్‌పై కోపంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై డైరెక్టస్ రాహుల్‌ సోషల్‌మీడియా ద్వారా స్పందిస్తూ ‘సినిమాలో రకుల్‌ పాత్ర గురించి..ఆమె బరువు గురించి లేనిపోని వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ అబద్దాలేనని కొట్టే పారేశారు.