రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషలతో పాటు హిందీలోనూ తెరపైకి ఎక్కుతున్న విషయంలో తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుతో పాటు పాటు ఇతర భాషల్లోనూ డబ్బింగ్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది.
ఇందులో భాగంగా ప్రభాస్ హిందీలో డబ్బింగ్ చెబుతాడా లేక వేరే గొంతు వినిపిస్తుందా అనే డౌట్స్ మొన్నటివరకు ఉండేవి. ఇప్పుడా ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. సాహో సినిమా హిందీ వెర్షన్ కు తనే డబ్బింగ్ చెప్పుకుంటానని ప్రకటించాడు ప్రభాస్.
బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన యంగ్ రెబల్ స్టార్ మాట్లాడుతూ సోనీ అనే టీచర్ దగ్గర హిందీ నేర్చుకున్నానని ప్రస్తుతం తనకు హిందీలో మాట్లాడటం వచ్చేసిందని కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు రెబల్ స్టార్. ఈ క్రమంలో హిందీ వెర్షన్ కు తనే డబ్బింగ్ చెప్పుకుంటానని ప్రభాస్ ప్రకటించాడు. మరి ప్రభాస్ హిందీ వాయిస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే డబ్బింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచిచూడాల్సిందే మరి