థియేటర్స్‌లో దుమ్ము రేపుతున్న ఇస్మార్ట్ శంకర్ !

డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా ''ఇస్మార్ట్ శంకర్'' పయనిస్తున్నాడు

Last Updated : Jul 22, 2019, 06:35 PM IST
థియేటర్స్‌లో దుమ్ము రేపుతున్న ఇస్మార్ట్ శంకర్ !

ఆశించిన దాని కంటే ఫలితంగా వస్తే ఎలాగుంటది.. ఎగిరి గంతులేయాలనిపిస్తది.. రామ్ మూవీ ''ఇస్మార్ట్ శంకర్'' విషయంలో కూడా ఫలితం అలాగే వస్తోంది. మాస్  మైంట్స్ కు ఈ మూవీ సరిగ్గా సూట్ కావడంతో  డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా పనియనిస్తోంది.

పూర్తి జగన్నాథ్ డైరక్షన్ లో రామ్ హీరోగా తెరపైకి వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మావీ మాస్ ప్రేక్షకులను తెగనచ్చేసిందట..ఒక సారి చాలదు..మళ్లీ మళ్లీ చూడాల్సిందే అంటున్నారు కుర్రకారు...ఆడియన్స్ కు తెగనచ్చడంతో  ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులుపుతోంది

ఓ పక్కా మాస్ మూవీ కోసం చాన్నాళ్లుగా ఎదురుచూసిన ఆడియన్స్, ఇస్మార్ట్ శంకర్ తో పండగ చేసుకుంటున్నారు. అలా విడుదలైన మొదటి రోజు నుంచి రికార్డు వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ అయింది. ఇప్పుడీ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది.

నిన్నటితో ఫస్ట్ వీకెండ్ (4 రోజులు) పూర్తిచేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 21 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ ఈ సినిమా 24 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. అలా ఫస్ట్ వీకెండ్ నాటికే ఈ సినిమా 140శాతం రికవర్ అయింది.

సో.. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం చూసుకుంటే.. ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలున్నాయి. మరో 3 రోజుల్లో సినిమాకు ఓవర్ ఫ్లోస్ రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో దర్శకుడు పూరి జగన్నాధ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు.

Trending News