డబ్బుల్లేక వీధుల్లో తిరుగుతున్న జాకీచాన్ కూతురు..?

ప్రపంచవ్యాపంగా ఉన్న మార్షల్ ఆర్ట్స్ అభిమానులకు ఆరాధ్య దైవమైన హీరో జాకీచాన్ కూతురికి ఇప్పడు దిక్కులేక వీధుల్లో తిరిగి ఆహారం అడుక్కొనే పరిస్థితి వచ్చిందట.

Updated: May 1, 2018, 07:09 PM IST
డబ్బుల్లేక వీధుల్లో తిరుగుతున్న జాకీచాన్ కూతురు..?

ప్రపంచవ్యాపంగా ఉన్న మార్షల్ ఆర్ట్స్ అభిమానులకు ఆరాధ్య దైవమైన హీరో జాకీచాన్ కూతురికి ఇప్పుడు దిక్కులేక వీధుల్లో తిరిగి ఆహారం అడుక్కొనే పరిస్థితి వచ్చిందట. వివరాల్లోకి వెళితే జాకీచాన్ ఒకానొక సందర్భంలో తనకు పెళ్లవ్వక ముందు ఎలైన్ అనే ఓ మోడల్‌తో ఎఫైర్ ఉందని తెలిపారు. ఆ తర్వాత అనేక పత్రికలు జాకీచాన్‌కి, ఎలైన్‌కి ఓ కుమార్తె జన్మించిందని.. ఆమెకు ఎట్టా అని పేరు పెట్టారని పేర్కొన్నాయి.

ప్రస్తుతం ఎట్టాకు 18 ఏళ్లు. గత కొద్ది సంవత్సరాలుగా ఆమె ఇంటికి రావడం మానేసిందట. తన గర్ల్ ఫ్రెండ్ యాండీ ఆటమ్‌తో కలిసి ఊర్లు పట్టుకొని తిరుగుతుందట. ఈ మధ్యకాలంలో ఈమె యూట్యూబ్‌లో ఓ వీడియో పెట్టింది. తాను జాకీచాన్ కూతురినని.. ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేకుండా బతుకుతున్నానని.. తిండి కోసం కూడా అడుక్కొనే పరిస్థితి వచ్చిందని.. తన ఈ పరిస్థితికి కారణం తన తల్లిదండ్రులేనని తెలిపింది

అయితే తన కూతురు చేసిన పనికి ఆమె తల్లి ఎలైన్ ఓ వెబ్ సైట్‌కి వివరణ ఇచ్చిందట. "డబ్బుల్లేకపోతే వెళ్లి ఆ పిల్లను కష్టపడి బతకమని చెప్పండి. ఏదో ఒక జాబ్ చేసుకోమని చెప్పండి. ప్రపంచంలోని గొప్ప గొప్ప వాళ్లందరూ కూడా కష్టపడే పైకి వచ్చారు. అంతేగానీ... కష్టపడకుండా డబ్బులు సంపాదించడం కోసం ఎవరి పేరో వాడుకోవడం.. పైగా వీడియో తీసి  యూట్యూబ్‌లో పెట్టడం.. ఇవ్వన్నీ కూడా చిల్లర పనులు. ఇలాంటి పనులు చేసేది నా కూతురైనా సరే నేను సమర్థించను" అని చీవాట్లు పెట్టిందట. అయితే ఈ విషయం జాకీచాన్ వద్దకు వెళ్లిందో లేదో మాత్రం తెలియదు.