Jayalalithaa`s biopic movie first look teaser | జయలలిత బయోపిక్ తలైవి ఫస్ట్ లుక్.. తలైవి పాత్రలో ఒదిగిపోయిన బాలీవుడ్ నటి

తమిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత(Jayalalithaa`s biopic) రియల్ స్టోరీ ఆధారంగా ‘త‌లైవి’ పేరుతో బ‌యోపిక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ప్రతిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ సినిమాను ఏ.ఎల్ విజయ్(Tamil director Vijay) అనే దర్శకుడు డైరెక్ట్ చేస్తుండగా తెలుగు నిర్మాత విష్ణువర్థన్ ఇందూరి,  శైలేష్ ఆర్‌.సింగ్ కలిసి నిర్మిస్తున్నారు.

Last Updated : Nov 23, 2019, 09:12 PM IST
Jayalalithaa`s biopic movie first look teaser | జయలలిత బయోపిక్ తలైవి ఫస్ట్ లుక్.. తలైవి పాత్రలో ఒదిగిపోయిన బాలీవుడ్ నటి

తమిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత(Jayalalithaa`s biopic) రియల్ స్టోరీ ఆధారంగా ‘త‌లైవి’ పేరుతో బ‌యోపిక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ప్రతిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ సినిమాను ఏ.ఎల్ విజయ్(Tamil director Vijay) అనే దర్శకుడు డైరెక్ట్ చేస్తుండగా తెలుగు నిర్మాత విష్ణువర్థన్ ఇందూరి,  శైలేష్ ఆర్‌.సింగ్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవల ప్రారంభ‌ం కాగా తాజాగా శనివారం నాడు ఫస్ట్ లుక్ టీజర్‌ను విడుదల చేశారు. తళైవి జయలలిత పాత్ర‌లో బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్(Kangana Ranaut) న‌టిస్తుండగా ఈ సినిమాలో మరో కీలక పాత్ర అయిన లెజెండరీ త‌మిళ‌నాడు దివంగ‌త రాజ‌కీయ నాయ‌కుడు ఎం.జి.రామ‌చంద్ర‌న్ (MGR) పాత్ర‌లో సీనియర్ హీరో అర‌వింద‌ స్వామి న‌టిస్తున్నారు. విశాల్ విట్టల్ సినిమాటోగ్రఫీ, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్నారు.

 

కంగ‌నా ర‌నౌత్‌ను జ‌య‌ల‌లిత‌గా తీర్చిదిద్దడం కోసం.. ‘బ్లేడ్ ర‌న్న‌ర్‌’, ‘కెప్టెన్ మార్వెల్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన ప్ర‌ముఖ హాలీవుడ్ మేక‌ప్ ఆర్టిస్టును రంగంలోకి దించారు. అందుకే కాబోలు తళైవి ఫస్ట్ లుక్ కటౌట్‌ చూస్తోంటే.. జయలలిత పాత్రలో కంగనా రనౌత్‌ ఒదిగిపోయినట్టే కనిపిస్తోంది. మరోవైపు కంగనా రనౌత్ సైతం అచ్చం జయలలితలా కనిపించేందుకు తన వంతు కృషిచేస్తోంది. అందులో భాగంగానే ఆమె భరతనాట్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. వచ్చే ఏడాది జూన్ 26న ఆడియెన్స్ ముందుకు రానున్న ఈ సినిమాపై తమిళనాట అమ్మ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. సినిమాల పరంగా... రాజకీయాల పరంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జయలలిత బయోపిక్ అంటే ఆ మాత్రం అంచనాలు ఉండటం సహజమే.

Trending News