జయలలిత బయోపిక్ లో కంగనా రనౌత్ నటిస్తుందని తెలిసిన వెంటనే అంతా ఈ యాంగిల్ లోనే ఆలోచించారు. ఈ పాత్ర కోసం ఆమె భారీగా బరువు పెరుగుతుందంటూ పుకార్లు కూడా వచ్చేశాయి. కానీ జయలలిత పాత్ర కోసం బరువు పెరగడానికి కంగనా ఒప్పుకోలేదట.
ఒక్కసారి బరువు పెరిగితే తగ్గడం చాలా కష్టం. రీసెంట్ గా సైజ్ జీరో సినిమా కోసం అనుష్క బరువు పెరిగింది. తర్వాత పెరిగిన వెయిట్ ను తగ్గించుకోవడానికి చాలా కష్టపడింది. బాలీవుడ్ లో కూడా ఇలాంటి లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకాబట్టే క్యారెక్టర్ కోసం బరువు పెరగడానికి కంగనా అంగీకరించలేదు.
బరువెక్కేందుకు కంగనా ఒప్పుకోకపోవడంతో జయలలిత బయోపిక్ కోసం ప్రోస్తటిక్స్ ఉపయోగించాలని నిర్ణయించారు. అంటే ప్రత్యేకమైన మేకప్ పద్ధతుల ద్వారా కంగనా లావుగా కనిపించేలా చేస్తారన్నమాట. రీసెంట్ గా లడ్డూబాబులో అల్లరినరేష్ కనిపించినట్టు.
తమిళ్ లో ఈ సినిమాకు తళైవి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తెలుగు, హిందీ భాషల్లో జయ టైటిల్ తో ఈ బయోపిక్ రాబోతోంది. ఏఎల్ విజయ్ డైరక్ట్ చేయబోతున్న ఈ సినిమాను విష్ణు ఇందూరి నిర్మించనున్నారు. ఈ బయోపిక్ లో ఎక్కువగా జయలలిత సినీజీవితాన్ని చూపించబోతున్నారు.