మహర్షి నుంచి.. '' నేను హీరోనేగా '' డిలీటెడ్ సీన్ విడుదల

మహర్షి మూవీ నుంచి డిలీటెడ్ సీన్ వీడియో విడుదల

Last Updated : Aug 18, 2019, 07:40 PM IST
మహర్షి నుంచి.. '' నేను హీరోనేగా '' డిలీటెడ్ సీన్ విడుదల

మ‌హేష్ బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన మహర్షి సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వంశీపైడిప‌ల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అల్ల‌రి న‌రేష్ మరో ప్ర‌ధాన పాత్ర‌లో నటించాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్‌ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్‌, అశ్విని దత్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకున్న మ‌హ‌ర్షి సినిమా ఇటీవలే 100 రోజులు కూడా పూర్తి చేసుకున్న సంద‌ర్బంగా తాజాగా ఈ సినిమా నుంచి డిలీటెడ్ సీన్‌కి సంబంధించిన ఓ వీడియోను చిత్ర నిర్మాత దిల్ రాజు విడుద‌ల చేశారు. కాలేజీ క్యాంపస్‌లో ఫైటింగ్ సీన్‌కి సంబంధించిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.

 

Trending News