ఫుల్ కామెడీ రివెంజ్ డ్రామా ; గ్యాంగ్ లీడర్ టీజర్ రివ్యూ మీకోసం

గత మూవీస్ కంటే భిన్నమైన కంటెంట్ తో తెరపైకి వస్తోంది గ్యాంగ్ లీడర్

Last Updated : Jul 24, 2019, 03:00 PM IST
ఫుల్ కామెడీ రివెంజ్ డ్రామా ; గ్యాంగ్ లీడర్ టీజర్ రివ్యూ మీకోసం

ఇప్పటి వరకు మనం హారర్ సినిమాలు చూశాం.. ఆ హారర్ స్టోరీలో కామెడీ సీన్స్ చూశాం. రొమాంటిక్ మూవీస్ చూశాం.. రొమాన్స్  స్టోరీలోనూ  కామెడీ సీన్స్ చూశాం. అయితే ఇప్పటి వరకు రివెంజ్ డ్రామాలు కూడా చూశాం.. మరి రివెంజ్ లో కామెడీ చూశారా..? అని ప్రశ్న వేస్తే సమధానం దొరకదు.. అయితే గ్యాంగ్ లీడర్ మూవీతో ఈ ప్రశ్నకు సమధానం దొరుకుతుంది..చూడ్డానికి ఇదో పెద్ద రివెంజ్ డ్రామాగా కనిపిస్తుంది. కానీ దాన్ని సీరియస్ గా కాకుండా సరదాగా చూపించారు.

సరికొత్త కాన్సెప్ట్ తో వస్తోన్న గ్యాంగ్ లీడర్ సినిమా ప్రేక్షకుల్లో తెగ ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతానికి టీజర్ రిలీజ్ చేసి ప్రేక్షకులకు కాస్తంత ఊరట ఇచ్చింది చిత్ర యూనిట్ .ఈ రోజు రిలీజైన గాంగ్ లీటర్ మూవీ  టీజర్ చూసి మీరూ ఎంజాయ్ చేయండి మరి.

 

గ్యాంగ్ లీడర్ టీజర్ రివ్యూ....

కంప్లీట్ కామెడీ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ''గ్యాంగ్ లీడర్'' మూవీలో నాని ఓ రైటర్. అతడి కలం పేరు పెన్సిల్. అతడి దగ్గరకు ఐదుగురు లేడీస్ వస్తారు. 70 ఏళ్ల బామ్మ నుంచి ఆరేళ్ల చిన్నారి వరకు అన్ని వయసుల వాళ్లు అందులో ఉంటారు. వాళ్లకు ఒకడు అన్యాయం చేస్తాడు. అతడ్ని చంపడానికి, ఆ ఐదుగురుకు నాని హెల్ప్ చేస్తాడు. చూడ్డానికి ఇదో పెద్ద రివెంజ్ డ్రామాగా కనిపిస్తుంది. కానీ దాన్ని సీరియస్ గా కాకుండా సరదాగా చూపించారు. ఈ ఐదుగురి గ్యాంగ్ కు నాని లీడర్ కాబట్టి ఈ సినిమాకు గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. 

నేచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్న నాని
ఇప్పటికే నేచురల్ స్టార్ అనిపించుకున్న నాని, టీజర్ లో మరింత నేచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ఓ బేబీతో ఆకట్టుకున్న లక్ష్మి, ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించారనే విషయం టీజర్ చూస్తేనే తెలుస్తోంది. వీళ్లతో పాటు కీలక పాత్రలన్నింటినీ పరిచయం చేశారు. విలన్ క్యారెక్టర్ తప్ప.

విలన్  వెనుక నుంచి మాత్రమే...
సినిమాలో నెగెటివ్ రోల్ పోషించిన కార్తికేయను వెనక నుంచి మాత్రమే చూపించారు. మూవీలో అతడు కారు రేసర్ గా కనిపిస్తున్నాడు. టీజర్ కు అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయబోతున్నారు.

Trending News