ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ : 'అరవింద సమేత' ఫస్ట్ లుక్ రిలీజ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే ఈ రోజు(మే 20).

Last Updated : May 20, 2018, 07:41 AM IST
ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ : 'అరవింద సమేత' ఫస్ట్ లుక్ రిలీజ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే ఈ రోజు(మే 20). ఎన్టీఆర్ జన్మదినం సందర్బంగా బ‌ర్త్ డే గిఫ్ట్ గా త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ ఇద్దరూ కలిసి మొదటిసారి పనిచేస్తుండటంతో ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. చేతిలో పదునైన అయుధాన్ని పట్టుకుని, సిక్స్ ప్యాక్ బాడీని చూపుతున్న ఎన్టీఆర్ స్టిల్‌ను ఈ పోస్టర్‌లో ఉంచారు.  

తొలుత సినిమాకు సంబంధించి కొన్ని టైటిల్స్ పరిశీలించిన మేకర్స్ ఫైనల్‌గా ‘అరవింద సమేత’ అనేది టైటిల్‌గా ‘వీర రాఘవ’ క్యాప్షన్‌గా ఫైనల్ చేసి ఫస్ట్ లుక్‌తో ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ చెప్పారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తూ హాట్ టాపిక్‌గా మారింది.  

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్‌లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో మాస్ & క్లాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్నది ఈ సినిమా. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మాతగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయబోతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ స‌రికొత్త లుక్‌ను మీరూ చూడండి..

 

Trending News