ప్రియా ప్రకాశ్‌‌ను వరించిన మరో భారీ ఆఫర్

                                          

Updated: Jul 10, 2018, 08:28 PM IST
ప్రియా ప్రకాశ్‌‌ను వరించిన మరో భారీ ఆఫర్

మలయాళి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌కు పాపులారీటీ రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆమెకు మరో భారీ ఆఫర్‌ వచ్చిపడింది. ఓ వాణిజ్య ప్రకటన కోసం రూ.కోటి డీల్‌కు ఆమె సంతకం చేసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుటికే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోవర్లు ఆరు మిలియన్లకు పైగా పెరిగిపోవడంతో దాని ద్వారా కూడా ఆమె బాగా సంపాదిస్తోంది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఒక్కో యాడ్‌కి రూ.8 లక్షలు పారితోషికం తీసుకుంటోంది. కాగా తాజా ఆఫర్ ఆమెకు సంతోషాన్ని మరింత రెట్టింపు చేసిందట. 

మలయాళ సినిమా ‘ఒరు అదార్‌ లవ్‌’లోని ఓ పాటలో కన్నుగీటుతూ  ప్రియా ప్రకాశ్‌ వారియర్‌  విపరీత పాప్యులారిటీ తెచ్చుకున్న విషయం తెలిసిందే.  సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోతున్నారు. దీంతో ఆమెకు ఇలా ఆఫర్ల మీరు ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. దీనికి తోడు ఆమెకు సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయట.