రియల్ లైఫ్ లోనూ లారెన్స్ హీరోనే; 150 మందికి ప్రాణం పోశాడు

                             

Updated: Oct 29, 2018, 03:42 PM IST
రియల్ లైఫ్ లోనూ లారెన్స్ హీరోనే; 150 మందికి ప్రాణం పోశాడు

తెరపైనే కాదు.. రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకుంటున్నాడు లారెన్స్. ఒకవైపు డాన్సర్ గా..హీరోగా..డైరెక్టర్ గా తన సినీ కెరీర్ కొనసాగిస్తూనే మరోవైపు సమాజసేవకు అంకితమయ్యాడు . ఈ క్రమంలో తను ఓ అరుదైనఘనత సాధించాడు. తన ఛారిటబుల్ ట్రస్త్ ద్వారా 150వ హార్ట్ ఆపరేషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా చేయించాడు. ఈ విషయన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. హృదయ సంబంధిత సమస్యలతో బాధపడే చిన్నారులకు ఆదుకునేందుకు ముందుకు వచ్చిన లారెస్స్.. తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత కొన్నేళ్ల నుంచి హార్ట్ ఆపరేషన్లు చేయిస్తున్నాడు. 

సక్సెస్ ఫుల్ గా 150వ ఆపరేషన్ చేయించిన లారెన్స్ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు. లారెన్స్ ఏమన్నాడంటే... ‘ఈ రోజు నేను  చాలా సంతోషంగా ఉన్నా... నా చారిటబుల్ ట్రస్ట్  సహాయంతో చేసిన 150వ ఓపెన్ హార్ట్ సర్జరీ సక్సెస్ అయింది. హార్ట్ సర్జరీ చేయించుకున్న ఈ చిన్నారి పేరు కావ్యశ్రీ. చిన్నారి హార్ట్‌లో హోల్ ఉంటే విజయవంతంగా సర్జరీ చేయించాను. ఈ ఆపరేషన్ ను సక్సెస్ ఫుల్ గా చేసిన డాక్టర్లకు నా కృతజ్ఞతలు. 

ఈ సందర్భంగా లారెస్ట్ మాట్లాడుతూ ' ఎవరైనా హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతూ... ఆపరేషన్ కోసం డబ్బు వెచ్చించలేని పరిస్థితిలో ఉంటే తన చారిటబుల్ ట్రస్టును కాంటాక్ట్ అవ్వండి అంటూ లారెన్స్ ట్వీట్ చేశాడు.