Baahubali in masks: కరోనావైరస్ సంక్రమణ ( Coronavirus ) నుంచి దూరంగా ఉండాలంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ప్రజల్లో కరోనాపై అవగాహన ( Coronavirus awareness ) కల్పిండానికి సెలబ్రిటీలు కూడా ముందుంటున్నారు. అందులో రాజమౌళి ( SS Rajamouli ) స్టేలే వేరు.
బాహుబలి ( Bahubali ) సినిమాతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినీ పరిశ్రమ ( TFI ) పేరు ప్రతిష్టతలను పెంచిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు సేఫ్‌గా ఉండాలి అంటూ ఇటీవలే స్టే సేఫ్ అనే క్యాంపెయిన్‌ను ప్రారంభించిన డైరెక్టర్ రాజమౌళి.. అందులో భాగంగానే తాజాగా ఒక ట్వీట్ చేశాడు.
Good job @avitoonindia and @coollazz #Unitedsoft VFX Studio team! #BBVsCOVID #IndiaFightsCorona #StaySafe
I hope everyone stays safe and exercise caution in these times. pic.twitter.com/kmhOyK3012
— rajamouli ss (@ssrajamouli) June 26, 2020
బాహుబలి-2లో ( Bahubali 2 ) క్లైమాక్స్‌లో బాహుబలి - భల్లాల దేవ మధ్య జరిగే ఫేస్ టు ఫేస్ ఫైట్ సన్నివేశంలో ఇద్దరు ఒకరికొకరు సవాల్‌కి ప్రతి సవాల్ చేసుకునే సన్నివేశాన్ని అందరం చూసి ఎంజాయ్ చేశాం. సరిగ్గా అదే సన్నివేశంలో బాహుబలి - భల్లాల దేవ మాస్కులు ధరిస్తే ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో చూపించారు. ఈ వీడియోను షేర్ చేసిన రాజమౌళి.. కరోనా నివారణ కోసం మాహిష్మతిలోనైనా మాస్కులు తప్పనిసరేననే సందేశాన్ని ఇచ్చారు. ఈ వీడియో షేర్ చేసిన రాజమౌళి ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. వ్యాయామాలు చేయండి అంటూ సందేశాన్నిచ్చాడు.
రాజమౌళి చేసిన ఈ ట్వీట్‌కు నెటిజెన్స్ నుంచి భారీ స్పందన కనిపించింది. మాహిష్మతిలో మాస్కులు అంటూ నెటిజెన్స్ చమత్కరిస్తున్నారు. బాహుబలి చిత్రం తరువాత రాజమౌళి, రామ్ చరణ్ ( Ram Charan ), జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR ) కాంబినేషన్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ ( RRR movie ) తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియెన్స్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.