సరికొత్త గెటప్‌లో రాజశేఖర్ ; ' కల్కి' టీజర్ రివ్యూ మీ కోసం

యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న కల్కీ మూవీలో రాజశేఖర్ సరికొత్త గెటప్ లో కనిపిస్తున్నాడు

Last Updated : Apr 10, 2019, 05:28 PM IST
సరికొత్త గెటప్‌లో రాజశేఖర్ ; ' కల్కి' టీజర్ రివ్యూ మీ కోసం

గరుడవేగ లో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసిన సీనియర్ నటుడు రాజశేఖర్ ...కల్కి మూవీలో తనలోని మరో యాంగిల్ ను చూపించేందుకు సిద్ధమయ్యాడు. ఈ మూవీలో సరికొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇదిలా ఉండగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. 

కథాంశం ఇదే...
 1980 బ్యాక్ డ్రాప్ లో ' కల్కి' మూవీ తెరకెక్కుతోంది. యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో హీరో రాజశేఖర్ మరోసారి పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు . టీజర్ లో ప్రతి ఫ్రేమ్ కొత్తగా ఉంది. సినిమాకు సంబంధించిన కీలకమైన పాత్రలన్నింటినీ టీజర్ లో పరిచయం చేశారు. శ్రవణ్ భరధ్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

నటి నటులు వీరే..
హ్యాపీ మ్యూవీ బ్యానర్ పై  ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. అదా శర్మ, నందిత శ్వేత, పూజిత పొన్నాడ ఇందులో హీరోయిన్లుగా నటించారు. వీళ్లలో అదా శర్మ క్యారెక్టర్ ను మాత్రమే టీజర్ లో పరిచయం చేశారు. సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా సమ్మర్ ఎట్రాక్షన్ గా త్వరలోనే థియేటర్లలోకి రాబోతోంది.

 

 

Trending News