ఎన్టీఆర్‌ బయోపిక్: రకుల్ ప్రీత్ ఫస్ట్ లుక్ రిలీజ్

ఎన్టీఆర్‌ బయోపిక్: రకుల్ ప్రీత్ ఫస్ట్ లుక్ రిలీజ్

Updated: Oct 10, 2018, 05:11 PM IST
ఎన్టీఆర్‌ బయోపిక్: రకుల్ ప్రీత్ ఫస్ట్ లుక్ రిలీజ్

ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా క్రిష్‌  జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘యన్‌.టి.ఆర్‌’. ఇందులో ఎన్టీఆర్‌ పాత్రలో ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు.

ఈ సినిమాను రెండు పార్టుల్లో తెరకెక్కిస్తున్నారు. తొలి భాగాన్ని ‘యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు’ టైటిల్‌తో, రెండో భాగాన్ని ‘మహానాయకుడు’ అనే టైటిల్‌‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్లను ఇటీవలే క్రిష్ విడుదల చేశాడు.

ఇక సినిమా విషయానికి వస్తే.. ఇప్పటివరకు ఎన్టీఆర్ లుక్‌‌ను, చంద్రబాబు నాయుడు లుక్‌ను, అక్కినేని నాగేశ్వరరావు లుక్‌ను చూశాము. తాజాగా మరో బ్యూటిఫుల్ లుక్‌ని మూవీ యూనిట్ బుధవారం రిలీజ్ చేసింది. ఆ లుక్ ఎవరిదో కాదు.. అందాల నటి శ్రీదేవిది. ‘యన్‌.టి.ఆర్‌’లో శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ర‌కుల్‌ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ లుక్ విడుదలైంది.

ప్ర‌స్తుతం కృష్ణా జిల్లా దివి సీమీలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ బయోపిక్‌కు సంబంధించిన తొలి పార్ట్‌ను వచ్చే ఏడాది జనవరి 9న, రెండో పార్ట్‌ను 24న విడుదల చేయబోతున్నారని సమాచారం .

కాగా ‘యన్‌.టి.ఆర్‌’ బయోపిక్‌లో ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యా బాల‌న్, ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ నటిస్తున్నారు. ఎస్వీఆర్ పాత్రలో మెగా బ్రదర్ నాగబాబు నటిస్తున్నాడని స‌మాచారం. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.