'యన్.టి.ఆర్' సినిమాలో చిన్న క్యారెక్టర్ చేయడం కూడా గొప్ప అని రానా దగ్గుబాటి ఓ ట్వీట్‌కు సమాధానమిచ్చారు. హీరో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌లతో పాటు తాను కలిసిన ఫోటోను రానా తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే చిన్న క్యారెక్టర్లు/సైడ్ క్యారెక్టర్లు చేయవద్దన్న ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు ఇలా సమాధానమిచ్చారు. ఆయన సమాధానానికి ప్రశంసలు కురుస్తున్నాయి. ఇటీవల తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'యన్.టి.ఆర్' సినిమా.. కృష్ణా జిల్లా నిమ్మకూరులో రెండో షెడ్యూల్‌కి సిద్దమైంది. ఎన్టీఆర్ చిన్నప్పటి ఇల్లు, ఆయన తిరిగిన వీధులు, చదివిన స్కూల్ వంటి సీన్లను షూట్ చేసి సినిమాలో చూపిస్తారని వినికిడి.
కాగా ఎన్టీఆర్ బయోపిక్‌లో రానా.. చంద్రబాబు నాయుడు పాత్రను పోషిస్తున్నట్లు అధికారికంగా చెప్పారు. బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు కథను చెప్పడానికి నేను కూడా కలిసి వస్తున్నా’ అని బాలకృష్ణ, క్రిష్‌తో కలిసి దిగిన ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అటు ఎన్టీఆర్ బయోపిక్‌లో ఏఎన్నార్ పాత్ర కోసం నటుడు సుమంత్‌ను సంప్రదించగా.. అందుకు ఆయన అంగీకరించినట్లు సమాచారం.
Coming together to tell you a story of an incredible human phenomenon called “N.T.RamaRao” pic.twitter.com/O1j8TKkQnx
— Rana Daggubati (@RanaDaggubati) August 3, 2018
ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యా బాలన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కైకాల సత్యనారాయణ, ప్రకాశ్‌రాజ్, వీకే నరేశ్, జిష్షు సేన్‌గుప్తా, మురళీశర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి సహ నిర్మాతలుగా ఉన్నారు.