AP CM convoy Issue: ఆంధ్రప్రదేశ్ అధికారుల తీరు మరోసారి వివాదాస్పదమైంది. ఈనెల 22న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలులో పర్యటించనున్నారు. అయితే జగన్ పర్యటన కోసం ఒంగోలు పోలీసులు ఓవరాక్షన్ చేశారు.
తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ ఉపాధ్యక్షురాలు, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ (65) (Ex MLA Satyaprabha) కన్నుమూశారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న సత్యప్రభ.. అనారోగ్యంతో బెంగళూరు (bengaluru) లోని వైదేహి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ (AP), తెలంగాణ (TS) లో రెండు రోజులుగాఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతితో ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) నీటిమట్టం 16.2అడుగులకు చేరింది. బ్యారేజీకి వరద నీరు భారీగా వస్తుండటంతో.. అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తెలుగుదేశం పార్టీ (TDP) కొత్త రథసారిధి ఎంపిక పూర్తయింది. ప్రస్తుత పరిణామాల మధ్య కళా వెంకట్రావు స్థానంలో మరో కీలక నేతను నియమించేందుకు పార్టీ అధినేత దృష్టి సారించారు. ఈ మేరకు కొత్త కమిటీపై కసరత్తు పూర్తి అయినట్లు సమాచారం.
ఆయన సినిమాల్లో విలన్ అయినప్పటికీ.. ఇప్పుడు అందరికీ హీరోగా మారాడు. కరోనా లాక్డౌన్ సమయంలో లక్షలాది మంది వలస కూలీలు ఇళ్లకు వెళ్లేందుకు, వారికి భోజన వసతులు కల్పించిన ఆపద్భాందవుడు..సోనూసూద్ ( Sonu Sood ) ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసును గెలుచుకున్నారు.
COVID-19 patient funeral: అమరావతి: కరోనావైరస్ని నివారించాలంటే కరోనావైరస్తో యుద్ధం చేయాలి కానీ.. కరోనా సోకిన రోగితో కాదు అని ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నప్పటికీ.. అక్కడక్కడ కరోనా సోకిన వారి పట్ల అధికారులు, జనం వ్యవహరిస్తున్న తీరు మాత్రం మారడం లేదు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనా లక్షణాలతో ఓ వృద్ధుడు మరణించగా.. ఆయన మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బంది జేసీబీతో స్మశానవాటికకు తరలించడం సంచలనం సృష్టించింది.
కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్ళి నేపాల్ సరిహద్దుల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికుల యోగాక్షేమాలపై సచివాలయంలోని ఆర్టీజి కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.