అరవింద సమేత క్లైమాక్స్‌ని మరో స్థాయికి చేర్చిన రెడ్డమ్మ తల్లి సాంగ్ ప్రోమో

అరవింద సమేత మూవీ క్లైమాక్స్‌కి ఆయువు పట్టుగా నిలిచిన రెడ్డమ్మ తల్లి ప్రోమో

Last Updated : Oct 25, 2018, 03:03 PM IST
అరవింద సమేత క్లైమాక్స్‌ని మరో స్థాయికి చేర్చిన రెడ్డమ్మ తల్లి సాంగ్ ప్రోమో

యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా నటించిన అరవింద సమేత సినిమా ప్రమోషన్స్ విషయంలో ఆ చిత్ర నిర్మాతలు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. విడుదలైన తర్వాత సైతం ఆ చిత్రంలో హైలైట్‌గా నిలిచిన సన్నివేశాలు, పాటల ప్రోమో వీడియోలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. అందులో భాగంగానే తాజాగా అరవింద సమేత సినిమా క్లైమాక్స్‌కి ఆయువు పట్టుగా నిలిచిన రెడ్డమ్మ తల్లి ప్రోమోను విడుదల చేశారు. ఎస్ఎస్ థమన్ కంపోజిషన్‌లో సూపర్ బీజీఎంతో సన్నివేశానికి ప్రాణం పోసిన ఈ ప్రోమో వీడియోకు అభిమానుల నుంచి సైతం మంచి స్పందన కనిపిస్తోంది.

Trending News