జియో వినియోగదారులకు శుభవార్త.. అప్పటివరకు రీఛార్జ్ చేయకపోయినా...

 జియో ప్రీపెయిడ్ వినియోగదారులకు రిలయన్స్ జియో సంస్థ శుభవార్తనందించింది. ప్లాన్ గడువు అయిపోయినప్పటికీ మే 3వ తేదీ వరకు ఇన్‌కమింగ్ సేవలను నిలిపివేయబోమని జియో ప్రకటించింది.

Last Updated : Apr 18, 2020, 04:42 PM IST
జియో వినియోగదారులకు శుభవార్త.. అప్పటివరకు రీఛార్జ్ చేయకపోయినా...

ముంబై: జియో ప్రీపెయిడ్ వినియోగదారులకు రిలయన్స్ జియో సంస్థ శుభవార్తనందించింది. ప్లాన్ గడువు అయిపోయినప్పటికీ మే 3వ తేదీ వరకు ఇన్‌కమింగ్ సేవలను నిలిపివేయబోమని జియో ప్రకటించింది. రీఛార్జ్ చేసుకోకపోయినా, ఇన్ కమింగ్ కాల్స్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జియో సంస్థ స్పష్టం చేసింది.

Read Also: తబ్లీగీ జమాత్,రోహింగ్యాలకు లింకేంటి..?

మరోవైపు ఔట్ గోయింగ్ కాల్స్ చేసుకోవడానికి మాత్రం రీచార్జ్ చేసుకోవాలని సూచించింది. దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో జియో ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. అయితే ఎయిర్ టెల్, వొడఫోన్-ఐడియా సంస్థలు కూడా ఇదే తరహాలో బంపర్ ఆఫర్లను ప్రకటించాయి. రోజు రోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉండేవిధంగా రిలయన్స్ జియో తన ఇన్‌కమింగ్ కాల్ సేవలను విస్తరించింది. దీంతో తక్కువ ఆదాయం కలిగిన వినియోగదారులతో పాటు రీఛార్జ్ చేయలేకపోతున్న వారికి ప్రయోజనం చేకూరుతుందని జియో ఓ ప్రకటనలో తెలిపింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News