లేడీ విలన్ పాత్రలో సమంత.. డ్రీమ్ రోల్ దక్కిందన్న బ్యూటీ

రంగస్థలం, మజిలీ, ఓ బేబీ వంటి సినిమాలతో నటిగా పీక్ లెవల్ పర్‌ఫార్మెన్స్ కనబర్చిన సమంత.. తాజాగా మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇంకా చెప్పాలంటే ఇది ఒక్క ప్రయోగం అనే కంటే ఒకేసారి రెండు ప్రయోగాలు అని చెప్పొచ్చు.

Last Updated : Nov 28, 2019, 06:10 PM IST
లేడీ విలన్ పాత్రలో సమంత.. డ్రీమ్ రోల్ దక్కిందన్న బ్యూటీ

రంగస్థలం, మజిలీ, ఓ బేబీ వంటి సినిమాలతో నటిగా పీక్ లెవల్ పర్‌ఫార్మెన్స్ కనబర్చిన సమంత.. తాజాగా మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇంకా చెప్పాలంటే ఇది ఒక్క ప్రయోగం అనే కంటే ఒకేసారి రెండు ప్రయోగాలు అని చెప్పొచ్చు. అందులో తొలి ప్రయోగం ఆమె తొలిసారిగా ఓ వెబ్‌సిరిస్‌లో నటించడమైతే.. అది కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించడం రెండో ప్రయోగం. అవును సమంత ఓ వెబ్‌సిరీస్‌కి సైన్ చేసింది. ''ది ఫ్యామిలీ మేన్'' అనే వెబ్ సిరీస్ గతంలో ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ వెబ్ సిరీస్‌కి కొనసాగింపుగా తాజాగా ''ఫ్యామిలీ మేన్ 2'' షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పిటి వరకు సినిమాల్లో పాజిటివ్ పాత్రలే పోషిస్తూ వచ్చిన సమంత.. ఈ వెబ్ సిరీస్‌లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించనుంది.

ది ఫ్యామిలీ మేన్ సిరిస్‌ని డైరెక్ట్ చేసిన దర్శకుల ద్వయం రాజ్ నిడిమోరు, క్రిష్ణ డికే ఈ సిరీస్‌ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. మొదటి భాగంలో నటించిన మనోజ్ బాజ్‌పేయి, ప్రియామణి ఇద్దరూ ఈ సీక్వెల్‌ సిరీస్‌లో కూడా నటిస్తున్నారు. ఈ మేరకు రాజ్ కుమార్ నిడిమోరు, క్రిష్ణ డికే ఓ ట్వీట్ చేశారు. ఈ సిరీస్‌కి సంబంధించిన వివరాలను ధృవీకరిస్తూ అమేజాన్ ప్రైమ్ సైతం మరో ట్వీట్ చేసింది.

 

'ది ఫ్యామిలీ మేన్ 2'లో నెగటివ్ షేడ్స్ పోషిస్తుండటంపై ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించిన సమంత.. తనకు అటువంటి డ్రీమ్ రోల్ ఇచ్చినందుకు మేకర్స్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

Trending News