నాని, సుధీర్ బాబు V ట్రెయిలర్ కు భారీ స్పందన

హీరోగా ఇన్నాళ్లూ అలరించిన నాని. . తొలిసారిగా నెగెటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు.  ఇప్పటి వరకు 24 సినిమాలు పూర్తి చేసుకున్న నాని. . 25వ చిత్రం ఎలా ఉంటుందనే దాన్ని అంచనాలకు అందకుండా చేశాడు. తొలిసారిగా నెగెటివ్  రోల్ పోషించి .. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ముందుకు వస్తున్నాడు.

Updated: Feb 18, 2020, 11:19 AM IST
నాని, సుధీర్ బాబు V ట్రెయిలర్ కు భారీ స్పందన

హీరోగా ఇన్నాళ్లూ అలరించిన నాని. . తొలిసారిగా నెగెటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు.  ఇప్పటి వరకు 24 సినిమాలు పూర్తి చేసుకున్న నాని. . 25వ చిత్రం ఎలా ఉంటుందనే దాన్ని అంచనాలకు అందకుండా చేశాడు. తొలిసారిగా నెగెటివ్  రోల్ పోషించి .. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ముందుకు వస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై నాని ఫ్యాన్స్ తోపాటు సాధారణ ప్రేక్షకులకు కూడా అంచనాలు పెరిగాయి. మరోవైపు  ఈ సినిమాలో ప్రధాన పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్నాడు.

అష్టా చెమ్మ ఫేమ్ ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని నెగెటివ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ సినిమా ట్రెయిలర్ ను సోమవారం రిలీజ్ చేశారు. విడుదలైన కొద్ది గంటల్లోనే 30 లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది.  'సోది ఆపు.. దమ్ముంటే నన్ను ఆపు' అంటూ నాని చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. దీపావళి ఉగాదికే కొనేయండి అంటూ సుధీర్ బాబు ట్వీట్ చేశారు. 

Read Also: ఈమె ఎవరో గుర్తు పట్టారా..?

యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. అన్ని హంగులు పూర్తి చేసి మార్చి  25న సినిమాను రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.  సినిమాలో నాని, సుధీర్ బాబుతోపాటు నివేదా థామస్, అదితి రావు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా .. నాని నెగెటివ్ రోల్ లో కనిపిస్తున్నాడు.  

ఇప్పటికే ఈ సినిమా పాటలకు మంచి స్పందన వచ్చింది. సినిమాకు అమిత్ త్రివేదీ సంగీత దర్శకత్వం వహించాడు. ప్రముఖ  సంగీత దర్శకుడు థమన్. .  సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..