Gaalodu Craze: మంచు విష్ణు జిన్నా క్లోజింగ్ కలెక్షన్స్ ను ఒక్కరోజులో చిత్తు చేసిన 'గాలోడు' సుడిగాలి సుధీర్

Gaalodu Crossed Ginna Full run Collections : మంచు విష్ణు జిన్నా సినిమా ఫుల్ రన్ కలెక్షన్స్ ను సుడిగాలి సుధీర్ గాలోడు సినిమా ఒక రోజులో క్రాస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ అంశం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 19, 2022, 03:54 PM IST
Gaalodu Craze: మంచు విష్ణు జిన్నా క్లోజింగ్ కలెక్షన్స్ ను ఒక్కరోజులో చిత్తు చేసిన 'గాలోడు' సుడిగాలి సుధీర్

Sudigali Sudheer's Gaalodu Crossed Ginna Full run Collections on Day 1: జబర్దస్త్ ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించిన సుడిగాలి సుధీర్ హీరోగా గతంలో అనేక ప్రయత్నాలు చేశారు. సాఫ్ట్వేర్ సుధీర్ సహా ఒకట్రెండు  సినిమాల్లో హీరోగా నటించారు కానీ అవి ఏవీ ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సహా మరి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో మెరిసేడు కానీ తన కెరీర్ గా అవి కూడా పెద్దగా ఉపయోగపడలేదు. అయితే గహనా సిప్పీ హీరోయిన్గా సుధీర్ హీరోగా తాజాగా గాలోడు అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకి ముందు నుంచి కాస్త బజ్ ఏర్పడడంతో మొదటి రోజు 60 -70 లక్షలు వసూలు చేసే అవకాశం ఉందని అంచనాలు వెలుపడ్డాయి.

కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా హైదరాబాద్, వైజాగ్ వంటి ప్రధాన నగరాల్లో మంచి వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ముందుగా వేసుకున్న అంచనాలను బట్టి 70 లక్షల దాకా వసూళ్లు రావచ్చని అంచనా వేశారు కానీ మొదటి రోజు తెలంగాణ ఏపీ వ్యాప్తంగా కోటి లక్ష రూపాయల దాకా గ్రాస్, 48 లక్షలు షేర్ వసూలు లభించినట్లయింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోటి రూపాయల 4 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి మొదటి రోజు పరవాలేదు అనిపించుకుంది. ఈ సినిమాకి నైజాం ప్రాంతంలో 36 లక్షలు, సీడెడ్ ప్రాంతంలో 18 లక్షలు, మిగతా ఆంధ్ర ప్రాంతంలో 47 లక్షలు వచ్చినట్లుగా చెబుతున్నారు.

అయితే ఇదే సమయంలో మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా సినిమా కలెక్షన్స్ తో ఈ గాలోడు కలెక్షన్స్ కంపేర్ చేస్తూ కొంత మంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మంచు విష్ణు సినిమా ఫుల్ రన్ లో కలెక్ట్ చేయలేకపోయిన డబ్బులు సుధీర్ సినిమా ఒకే రోజులో కలెక్ట్ చేసిందని అంటున్నారు. మంచు విష్ణు జిన్నా క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికి వస్తే నైజాం ప్రాంతంలో 21 లక్షలు, సీడెడ్ ప్రాంతంలో 15 లక్షలు, మిగతా ఆంధ్ర ప్రాంతంలో 23 లక్షలు మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో 59 లక్షల షేర్ వసూలు సాధించింది. మిగతా భారతదేశం అలాగే ఓవర్సీస్ సహా మిగతా భాషల్లో 14 లక్షలు మాత్రమే వసూలు చేసింది.

మొత్తం మీద జిన్నా సినిమా ఓవరాల్ గా 73 లక్షల మాత్రమే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాని నాలుగు లక్షల 35 కోట్లకు అమ్మడంతో నాలుగు కోట్ల 60 లక్షలు వస్తే బ్రేక్ ఈవెన్ ఉంటుందని భావించారు. అయితే మూడు కోట్ల 87 లక్షల లాస్ తో ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో మంచు విష్ణు తో పాటు పాయల్ రాజ్ పుత్, సన్నిలియోన్ వంటి మార్కెట్ ఉన్నవారు కనిపించినా సరే ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.

అదే గాలోడు సినిమా విషయానికి వస్తే సుధీర్ ఒక్కడే ఆ సినిమాకి పెద్ద అసెట్. అతను తప్ప పెద్దగా క్రేజ్ ఉన్నవారు ఎవరూ లేరు. హీరోయిన్ గతంలో చోర్ బజార్ అనే సినిమాలో కనిపించింది కానీ ఆమెకు పెద్దగా హైప్ లేదు. ఆమె ఎవరో కూడా సగం మందికి తెలియదు పూర్తిగా ఇది సుధీర్ వన్ మ్యాన్ షో అని మంచు విష్ణు జిన్నా సినిమా క్లోసింగ్ కలెక్షన్స్ను కూడా సుధీర్ ఒక్కరోజులోనే క్రాస్ చేశాడని, ఇది మావోడి సత్తా అని సుధీర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి మంచు ఫాన్స్ దీనికి ఎలా కౌంటర్ ఇస్తారో చూడాల్సి ఉంది. 

Also Read: Kantara: మరో రికార్డు బద్దలు కొట్టిన కాంతార, రజనీకాంత్, యష్ సరసన రిషబ్ శెట్టి!

Also Read: Tollywood Heroine: డైరెక్టర్ కు నరకం చూపించిన హీరోయిన్.. ఆ మాట అన్నాడని అడుక్కునేలా చేసిందట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News