పోర్న్ స్టార్‌గా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సాధించిన సన్నీ లియోన్.. ఆ తర్వాత ఇండియాకి వచ్చి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలలో కూడా నటించింది. 2012లో బాలీవుడ్లో 'జిస్మ్ 2' చిత్రం ద్వారా హిందీ చిత్రపరిశ్రమకు పరిచయమైన సన్నీ ఆ తర్వాత రాగిణి ఎంఎంఎస్ 2, హేట్ స్టోరీ 2, ఏక్ పహేలీ లీలా, సింగ్ ఈజ్ బ్లింగ్, రేస్, బాద్షాహో లాంటి హిట్ చిత్రాల్లోనూ నటించింది.
తెలుగులో కూడా కరెంట్ తీగ, పీఎస్వీ గరుడవేగ చిత్రాలలో నటించింది. ప్రస్తుతం భారతదేశంలో సన్నీ లియోన్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. బిగ్ బాస్ లాంటి షోల ద్వారా కూడా సన్నీ బాగా పాపులర్ అయ్యింది. అంతే కాదు.. పలువురు అనాథలను కూడా దత్తత తీసుకొని ఆమె చదివిస్తోంది. ప్రస్తుతం ఈమె బయోపిక్ కూడా వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి
‘కరణ్‌జీత్ కౌర్ - ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్’ పేరుతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతుందని... ఇందులో సన్నీకి సంబంధించిన చిన్ననాటి సంగతులతో పాటు ఆమె ఎలాంటి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.. ఎలా తనకుంటూ ఒక సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకుంది లాంటి విశేషాలన్నీ చూపిస్తారని వార్తలు వస్తున్నాయి. కరణ్ జీత్ కౌర్ వోహ్రా అనేది సన్నిలియోన్ అసలు పేరు. ఆమె కెనడాలో ఓ సిక్కు కుటుంబంలో జన్మించింది.