The Warriorr day 1 collections: ఇస్మార్ట్ శంకర్ రికార్డ్ బద్దలు కొట్టలేకపోయిన రామ్.. ది వారియర్ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

The Warriorr day 1 collections: రామ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం 'ది వారియర్'. ఈ సినిమా మొదటిరోజు ఏ మేరకు వసూళ్లు సాధించింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 15, 2022, 03:24 PM IST
  • రామ్ హీరోగా ది వారియర్ రిలీజ్
  • సినిమాకు మిశ్రమ స్పందన
  • మొదటి రోజు ఆసక్తికరంగా వసూళ్లు
The Warriorr day 1 collections: ఇస్మార్ట్ శంకర్ రికార్డ్ బద్దలు కొట్టలేకపోయిన రామ్.. ది వారియర్ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

The Warriorr day 1 collections: రామ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం 'ది వారియర్'. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 14 వ తేదీన విడుదలైంది. అయితే విడుదలైన మొదటి ఆట నుంచే సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. కొంతమంది సినిమా అద్భుతంగా ఉందని కామెంట్ చేస్తుంటే మరి కొంతమంది మాత్రం రొటీన్ స్టోరీ అంటూ కామెంట్ చేస్తున్నారు. రామ్ అభిమానులైతే రామ్ సినిమాలో అద్భుతంగా నటించాడని సంబరపడుతున్నారు.

కృతి శెట్టి మరింత అందంగా కనిపిస్తోందని ఆమె అభిమానులు కూడా ఆనందపడుతున్నారు. ఇక ఈ సందర్భంగా ఈ సినిమా మొదటిరోజు ఏ మేరకు వసూళ్లు సాధించింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది వారియర్ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఊహించిన మేర మంచి వసూళ్లు రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వారీగా చూసుకుంటే నైజాంలో 1.95 కోట్లు, సీడెడ్లో 1.06 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.02 కోట్లు, ఈస్ట్ లో 51 లక్షలు, వెస్ట్ లో 67 లక్షలు, గుంటూరులో 1.19 కోట్లు, కృష్ణాలో 33 లక్షలు, నెల్లూరులో 29 లక్షలు వసూళ్లు వచ్చాయి.

రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ది వారియర్ సినిమా 7.02 కోట్లు షేర్ వసూళ్లు, 10.20 గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇక కర్నాటక సహా మిగతా భారతదేశంలో 40 లక్షలు వసూలు చేసిన ది వారియర్, ఓవర్ సీస్లో 30 లక్షలు, తమిళంలో 30 లక్షలు వసూలు చేసింది. ఆ లెక్క ది వారియర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 8.02 కోట్లు షేర్, 12.20 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల ప్రకారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 38.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా బ్రేక్ ఈవెన్  39 కోట్లుగా ఫిక్స్ చేశారు. ఈ సినిమా మొదటి రోజే 8.02 కోట్లు రాబట్టడంలో ఇంకా ఈ సినిమా 30.98 కోట్ల వసూళ్లు రాబట్టాల్సి ఉంది.రామ్ కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మొదటి రోజూ 7. 72 కోట్లు సాధించగా ఈ సినిమా 07.02 కోట్లు కలెక్ట్ చేసింది. 

Also Read: Jabardasth Yedukondalu: కిరాక్ ఆర్పీ సినిమా అందుకే ఆగింది.. అసలు ఫ్రాడ్ బయటపెట్టిన ఏడుకొండలు

Also Read: Pratap Pothen: రాధిక మాజీ భర్త ప్రతాప్ పోతెన్ కన్నుమూత

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News