వెంకీ మామ ట్రైలర్: అంచనాలు పెంచిన మామా-అల్లుళ్ల మల్టీస్టారర్

మామ-అల్లుళ్లయిన విక్టరీ వెంకటేష్, చైతూల కాంబోలో రూపొందుతున్న వెంకీ మామ మూవీ ట్రైలర్ ఇవాళ ఆడియెన్స్ ముందుకొచ్చేసింది. ఇద్దరు హీరోలకు చెందిన అభిమానులను ఎప్పటి నుంచో ఊరిస్తున్న ఈ సినిమా ట్రైలర్ అభిమానుల అంచనాలకు తగినట్టుగానే ఉంది.

Updated: Dec 8, 2019, 03:05 AM IST
వెంకీ మామ ట్రైలర్: అంచనాలు పెంచిన మామా-అల్లుళ్ల మల్టీస్టారర్
Youtube@SureshProductions

మామ-అల్లుళ్లయిన విక్టరీ వెంకటేష్, చైతూల కాంబోలో రూపొందుతున్న వెంకీ మామ మూవీ ట్రైలర్ ఇవాళ ఆడియెన్స్ ముందుకొచ్చేసింది. ఇద్దరు హీరోలకు చెందిన అభిమానులను ఎప్పటి నుంచో ఊరిస్తున్న ఈ సినిమా ట్రైలర్ అభిమానుల అంచనాలకు తగినట్టుగానే ఉంది. కామెడీ టైమింగ్, యాక్షన్‌కి కేరాఫ్ అడ్రస్ అయిన వెంకీ ఈ సినిమాలోనూ అల్లుడితో కలిసి మంచి కామెడినే పండించాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అలాగే చైతూ సైతం మామతో పోటీపడి మరీ యాక్షన్ సన్నివేశాలు చేసినట్టు ట్రైలర్‌లో చూపించిన పలు యాక్షన్ సీన్స్ చెబుతున్నాయి. కేఎస్ రవీంద్ర(బాబీ) డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 13న విడుదల కానుంది.

మనిషి తల రాతను రాసే శక్తి దేవుడికుందని నీ నమ్మకం.. ఆ రాతను తిరిగి రాసే శక్తి మనిషి ప్రేమకు ఉందని నా నమ్మకం" అని హీరో వెంకటేశ్ చెప్పే డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్‌తోనే సినిమాలోని యాక్షన్, కామెడి, ఎమోషన్, లవ్, విలనిజంకు సంబంధించిన అన్ని రంగులను చూపించే ప్రయత్నం చేశారు. మొత్తంగా సినిమాపై అంచనాలు పెరిగేలా చూసుకోవడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఖమ్మంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.