O Manchi Ghost: నవ్వించేందుకు వచ్చేస్తున్న ‘ఓ మంచి ఘోస్ట్’.. ఆ రోజే థియేటర్స్‌లో సందడి

O Manchi Ghost Release Date: ఆడియన్స్‌ను నవ్విస్తునే భయపెట్టించేందుకు వచేస్తోంది ఓ మంచి ఘోస్ట్ మూవీ. జూన్ 14న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 6, 2024, 08:09 PM IST
O Manchi Ghost: నవ్వించేందుకు వచ్చేస్తున్న ‘ఓ మంచి ఘోస్ట్’.. ఆ రోజే థియేటర్స్‌లో సందడి

O Manchi Ghost Release Date: హార్రర్, కామెడీ మిక్స్‌తో వచ్చే సినిమాలకు ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమాలకు ఇటు ఓటీటీ, అటు థియేటర్స్ ప్రేక్షకుల్లో మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఇదే సక్సెస్ ఫార్ములాతో ఆడియన్స్‌ను అలరించేందుకు వచ్చేస్తోంది OMG (ఓ మంచి ఘోస్ట్) మూవీ. శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, హాస్యనటుడు రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై డా.అబినికా ఇనాబతుని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తుండడంతో ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది.

Also Read: Chandrababu Naidu: ఏపీలో ఎప్పుడు సొంత బలంతో ముఖ్యమంత్రి కాలేకపోయిన  చంద్రబాబు..

తాజాగా రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. జూన్ 14న ‘ఓ మంచి ఘోస్ట్’ మూవీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు రిలీజ్ పోస్టర్‌ను వదిలారు. ఈ పోస్టర్‌లో  వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్ తదితరులు కనిపిస్తున్నారు. ఆద్యంతం నవ్విస్తూ, భయపెట్టించేందుకు ఈ సినిమా వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ టీజర్‌లో 'ఒసేయ్ నువ్వు అరుంధతికి అక్కవైనా.. చంద్రముఖి చెల్లివైనా.. కాశ్మోరా లవర్‌వైనా.. కాంచన కజిన్‌వైనా..', 'నేను మోహిని పిశాచి మోహం తీర్చా.. కామిని పిశాచి కామం తీర్చా.. శంకిని పిశాచి సంక నాకా.. సంక నాకించా..' అంటూ వచ్చిన డైలాగ్స్ నవ్వులు పూయించాయి. దెయ్యం క్యారెక్టర్‌లో నందితా శ్వేతా భయపెట్టేలా ఉంది. ఆండ్రూ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నారు. సుప్రియ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. ఎటిటర్‌గా ఎం.ఆర్.వర్మ వ్యవహరించారు.  

టెక్నికల్ టీమ్

==> బ్యానర్: మార్క్‌సెట్ నెట్‌వర్క్‌
==> నిర్మాత: డా.అబినికా ఇనాబతుని
==> దర్శకత్వం: శంకర్ మార్తాండ్
==> సినిమాటోగ్రాఫర్: ఐ ఆండ్రూ
==> మ్యూజిక్ డైరెక్టర్: అనూప్ రూబెన్స్
==> ఆర్ట్ డైరెక్టర్: సుప్రియ
==> ఎడిటర్: ఎం.ఆర్.వర్మ
==> కొరియోగ్రాఫర్: బాబా భాస్కర్
==> విజువల్ ఎఫెక్ట్స్: విక్టర్, కళ్యాణ్, విజయ్
==> PRO: SR ప్రమోషన్స్ (సాయి సతీష్)

Also Read: Meenakshi Chaudhary: మహేష్ బాబు సినిమాలో అవమానం.. కానీ అందుకే ఇప్పుడు సత్కారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News