4 కెమెరాలు, 10 GB వరకు ర్యామ్‌తో లాంచ్ అయిన షియోమి ఎంఐ మిక్స్ 3 ఫోన్‌ ధర ఎంతో తెలుసా ?

24 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 10 GB వరకు ర్యామ్‌తో లాంచ్ అయిన షియోమి ఎంఐ మిక్స్ 3 స్మార్ట్ ఫోన్‌

Last Updated : Oct 25, 2018, 06:31 PM IST
4 కెమెరాలు, 10 GB వరకు ర్యామ్‌తో లాంచ్ అయిన షియోమి ఎంఐ మిక్స్ 3 ఫోన్‌ ధర ఎంతో తెలుసా ?

స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో తక్కువ కాలంలోనే తనదైన మార్క్ వేసుకున్న మొబైల్ మేకర్స్ షియోమి తాజాగా మొబైల్ మార్కెట్‌లోకి మరో అధునాతనమైన మొబైల్‌ని లాంచ్ చేసింది. గురువారం బీజింగ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో షియోమి ఈ స్మార్ట్ ఫోన్‌ని లాంచ్ చేసింది. ఫ్రంట్ కెమెరా స్లైడర్, మొత్తం 4 కెమెరాలు, 10GB వరకు ర్యామ్, స్నాప్ డ్రాగన్ 845 SoC, 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఆల్‌బేస్ కెమెరా, వైర్‌లెస్ చార్జర్‌తో వేగంగా చార్జింగ్ అయ్యే పరిజ్ఞానం కలిగి ఉండటం ఈ మొబైల్‌కి ఉన్న ప్రత్యేకతలు. 

షియోమి ఎంఐ మిక్స్ 3 స్మార్ట్ ఫోన్స్‌లో ప్రారంభ శ్రేణి మోడల్ అయిన 6GB RAM + 128 GB స్టోరేజీ వెర్షన్ ధరలు 3,299 చైనీస్ యువాన్స్ నుంచి మొదలు కానున్నాయి. అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 34,800 అన్నమాట. 8GB RAM + 128GB వేరియంట్ మోడల్ ధరలు 3,599 చైనీస్ యువాన్స్( సుమారు రూ.37,900) కాగా 8GB RAM + 256GB స్టోరేజీ వేరియంట్ ధరలు 3,999 చైనీస్ యువాన్స్ (సుమారు రూ. 42,100)గా ఉన్నాయి. 

Trending News